Chalo Premiddam: రొమాంటిక్ లవ్ థ్రిల్లర్.. అమ్మాయి ఎంగిలంటే అబ్బాయిలకి ఎందుకంత ఇష్టం!
కళ్ళలో కళ్ళు పెట్టిచూస్తే అబ్బాయి లవ్ అమ్మాయికి తెలిసిపోద్దా.. అమ్మాయిల ఎంగిలంటే అబ్బాయిలకి ఎందుకంత ఇష్టం అనే డైలాగ్స్.. ఉన్నోడివి ఉండక ఇల్లు అద్దెకిచ్చిన ఓనరోళ్ళ పిల్లకే..

Chalo Premiddam
Chalo Premiddam: కళ్ళలో కళ్ళు పెట్టిచూస్తే అబ్బాయి లవ్ అమ్మాయికి తెలిసిపోద్దా.. అమ్మాయిల ఎంగిలంటే అబ్బాయిలకి ఎందుకంత ఇష్టం అనే డైలాగ్స్.. ఉన్నోడివి ఉండక ఇల్లు అద్దెకిచ్చిన ఓనరోళ్ళ పిల్లకే లైన్ వేస్తివి కొడకా.. గొర్రె కసయోడిని నమ్మినట్లు పోయి పోయి పోరీ చేతిలో ఎందుకు పడ్డావ్ బిడ్డో అంటూ సాగే పాట. ఇదీ ఈ మధ్యే వచ్చిన ఛలో ప్రేమిద్దాం టీజర్. ఇది మాత్రమే కాదు ఇంకా కొన్ని చమక్కులు ఈ టీజర్ లో కనిపించాయి. దీనిని బట్టి చూస్తే ఇది రొమాంటిక్ లవ్ థ్రిల్లర్ అని అర్ధమైపోయింది.
NBK 107: బాలయ్యతో శృతి.. ఎవరి కోసం ఓకే చెప్పిందో?!
ఇక, ఇప్పుడు తాజాగా ఈ సినిమా దర్శక, నిర్మాతలు కూడా ఇదే విషయాన్ని చెప్పారు. ట్రెండ్ కు అనుగుణంగా ఉండేలా ఛలో ప్రేమిద్దాం సినిమా వచ్చిందని నిర్మాత ఉదయ్ కిరణ్ చెప్పారు. రాజీవ్ కనకాలతో బ్లాక్ అండ్ వైట్, వరుణ్ సందేశ్ తో ప్రియుడు లాంటి చిత్రాలను నిర్మించిన నిర్మాత ఈ ఉదయ్ కిరణ్. చాలా కాలంగా తర్వాత ఇలా మంచి యూత్ ఫుల్ కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాలో సాయి రోనక్, నేహ సోలంకి హీరో హీరోయిన్లుగా నటించారు. ఇప్పటికే విడుదలైన టీజర్ లో ఈ ఇద్దరి చార్మింగ్ తో పాటు ఫుల్ జోష్ కనిపిస్తుంది.
Bheemla Nayak: లాలా భీమ్లా.. జనవరిలోనా.. వాయిదానా?
సురేష్ శేఖర్ రేపల్లే దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 19న థియేటర్ రిలీజ్ కు రెడీ అయ్యింది. సినిమా అవుట్ ఫుట్ మీద నమ్మకంతో రిలీజ్ కూడా భారీగానే ప్లాన్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలలో రెండు వందలకు పైగా థియేటర్లలో ఈ సినిమా విడుదల కానుంది. యూత్ ఫుల్ సినిమానే కానీ.. కుటుంబ ప్రేక్షకులకు కూడా నచ్చేలా ఈ సినిమాని తీర్చిదిద్దామని.. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా దుబాయ్ లో కూడా సాంగ్స్ షూట్ చేశామని చెప్తున్నారు. ఇక మ్యూజిక్ దర్శకుడు భీమ్స్ సిసిరోలియో ఈ సినిమాతో కొత్త టైప్ ఆఫ్ మ్యూజిక్ వినిపించబోతున్నానని.. చెప్తున్నాడు. అన్నట్లు ఈ సినిమా పూర్తికాకుండానే రవితేజ లాంటి హీరోతో ఖిలాడీ సినిమాకి మ్యూజిక్ అందించే అఫర్ కొట్టేశాడు భీమ్స్.
Unstoppable with NBK: రౌడీ హీరోతో స్పెషల్ ఎపిసోడ్.. ఇది వేరే లెవెల్!
ఛలో ప్రేమిద్దాం నిర్మాత ఉదయ్ కిరణ్ మాట్లాడుతూ.. గతంలో ప్రియుడు సినిమా టైమ్ నుంచే దర్శకుడు సురేష్ శేఖర్ పరిచయం. అతను చెప్పిన కథ బాగా నచ్చిఈ సినిమాను నిర్మించాం. నేటి ట్రెండ్ కు అనుగుణంగా సినిమా ఉంటుంది. లవ్ స్టోరి ఫ్లస్ థ్రిల్లర్ నేపథ్యంగా ఈ సినిమా తెరకెక్కిందని చెప్పారు. సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో మాట్లాడుతూ.. భీమ్స్ అంటే బీట్, ఫోక్ సాంగ్స్ పోయి ఈ సినిమాతో నా నుంచి కొత్త టైప్ ఆఫ్ మ్యూజిక్ వింటారని చెప్పాడు. ఈ సినిమాలో శశాంక్, సిజ్జు, అలీ, నాగినీడు, పోసాని కృష్ణమురళి, రఘుబాబు, బాహుబలి ప్రభాకర్, హేమ, రఘు కారుమంచి, సూర్య, తాగుబోతు రమేష్, అనంత్ ఇలా భారీ తారాగణమే ఉంది.