NBK 107: బాలయ్యతో శృతి.. ఎవరి కోసం ఓకే చెప్పిందో?!
నందమూరి నటసింహం బాలయ్య అఖండ సినిమా ఇంకా విడుదల ప్రకటన కూడా కాలేదు కానీ.. తన తర్వాత సినిమాకి సిద్దమయ్యాడు. క్రాక్ సినిమాతో గ్రాండ్ సక్సెస్ కొట్టిన గోపీచంద్ మలినేనితో బాలయ్య..

Nbk 107 (1)
NBK 107: నందమూరి నటసింహం బాలయ్య అఖండ సినిమా ఇంకా విడుదల ప్రకటన కూడా కాలేదు కానీ.. తన తర్వాత సినిమాకి సిద్దమయ్యాడు. క్రాక్ సినిమాతో గ్రాండ్ సక్సెస్ కొట్టిన గోపీచంద్ మలినేనితో బాలయ్య తన 107వ సినిమా మొదలు పెట్టేశాడు. శనివారం ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమవగా దర్శకులు వివి వినాయక్ క్లాప్ కొట్టగా, బోయపాటి శ్రీను కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఫస్ట్ షాట్ ని హరీష్ శంకర్ డైరెక్ట్ చేశారు.
Bheemla Nayak: లాలా భీమ్లా.. జనవరిలోనా.. వాయిదానా?
ఈ సినిమాలో బాలయ్య సరసన శృతిహాసన్ నటించనుందని కొద్దిరోజుల క్రితమే బయటకొచ్చిన సంగతి తెలిసిందే. కాగా, శృతిహాసన్ కు సీనియర్ హీరోలతో ఇదే తొలిసినిమా. తెలుగు, తమిళంలో ఇంతవరకు శృతి ఈ తరం హీరోలతో నటించలేదు. తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్.. తమిళంలో కూడా కమల్ హాసన్ తోటి హీరోలతో నటించేందుకు శృతి ఇప్పటి వరకు ఒక రూల్ పెట్టుకొని అందుకు సిద్ధంగా లేదని ఇండస్ట్రీలో చాలాకాలంగా ఒక టాక్ నడుస్తుంది.
Unstoppable with NBK: రౌడీ హీరోతో స్పెషల్ ఎపిసోడ్.. ఇది వేరే లెవెల్!
ఈ జెనరేషన్ తరవాత హీరోలైన సూర్య, రవితేజ లాంటి వాళ్ళతో పాటు యంగ్ హీరోల సినిమాలకి ఇప్పటి వరకు సైఅంటున్న శృతి ఇప్పుడు తొలిసారి సీనియర్ హీరో బాలయ్య సినిమాకి ఒకే చెప్పింది. దీంతో ఇప్పుడు ఇదే టాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్స్ హాట్ టాపిక్ గా మారింది. శృతికి దర్శకుడు గోపీచంద్ మలినేనితో మంచి అనుబంధం ఉంది. గతంలో బలుపుతో పాటు శృతి చాలాకాలంగా సరైన హిట్ కోసం చూస్తున్న సమయంలో క్రాక్ లాంటి హిట్ అందించాడు.
Maha Samudram : ఓటిటిలో ‘మహా సముద్రం’
గోపీచంద్ కూడా శృతితో రాపో కారణంగా బాలయ్య సినిమాకు ముందుగా శృతినే అప్రోచ్ అయ్యాడు. దీంతో శృతి కాదనలేకపోయింది. మొత్తంగా ఇలా శృతి కూడా సీనియర్ జనరేషన్ హీరోలతో తొలిసారి రొమాన్స్ చేయనుంది. మరి ఈ సినిమా ఎలా ఉండనుందో.. ఇందులో బాలయ్య-శృతిల జంట ఎలా ఉండనుందో ఫీడ్ బ్యాక్ ను బట్టే ఆమెకి సీనియర్ హీరోలతో మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశం ఉంది.