Malavika Manoj : టెన్త్ క్లాస్ కే హీరోయిన్ ఛాన్స్.. స్విమ్మింగ్ రాకపోయినా సినిమా కోసం నీళ్ళల్లో దూకేసి..

ప్రమోషన్స్ లో భాగంగా మాళవిక మనోజ్‌ నేడు మీడియాతో ముచ్చటించి పలు ఆసక్తికర విషయాలు తెలిపారు.

Malavika Manoj

Malavika Manoj : మలయాళ భామ మాళవిక మనోజ్ తమిళ సినిమా జో తో మంచి ఫేమ్ తెచ్చుకుంది. ఇప్పుడు తెలుగులో సుహాస్ సరసన ‘ఓ భామ అయ్యో రామ’ సినిమాతో రాబోతుంది. వీ ఆర్ట్స్ బ్యానర్ పై హరీష్ నల్ల నిర్మాణంలో రామ్ గోధల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా జూలై 11న రిలీజ్ కానుంది. ప్రమోషన్స్ లో భాగంగా మాళవిక మనోజ్‌ నేడు మీడియాతో ముచ్చటించి పలు ఆసక్తికర విషయాలు తెలిపారు.

మాళవిక మనోజ్‌ ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. తమిళంలో నటించిన జో సినిమా చూసి డైరెక్టర్ నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చాడు. ఈ స్టోరీ చాలా డిఫరెంట్‌గా అనిపించింది. గతంలో నేను చేసిన సినిమాల్లో విలేజ్‌ సింపుల్‌ గర్ల్‌గా చేశాను. ఈ సినిమలో నా పాత్ర ఎంతో మోడ్రరన్‌గా, హైపర్‌గా, ఆటిట్యూడ్‌తో, డామినేట్ గా ఉంటుంది. నాకు స్విమింగ్‌ రాకపోయినా ఈ సినిమాలో ఓ సన్నివేశంలో నీళ్ళల్లోకి దూకేసాను. నాకు డూప్ చేయాల్సిన అమ్మాయి రాకపోవడంతో షూటింగ్‌ వాయిదా పడటం ఇష్టం లేక నేను భయపడుతూనే దూకేసాను. అసిస్టెంట్ డైరెక్టర్స్ సపోర్ట్ చేసారు. ఈ సినిమాలో లవ్‌ సన్నివేశాల్లో ఫీల్‌ కొత్తగా ఉంటుంది అని తెలిపింది.

Also Read : Sridevi : తమిళ్ లో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసిన ‘కోర్ట్’ భామ..

ఫ్యామిలీ నేపథ్యం, తన బ్యాక్ గ్రౌండ్ గురించి మాట్లాడుతూ.. అసలు సినిమా నేపథ్యంతో సంబంధం లేని ఫ్యామిలీ నాది. ఫ్యామిలీ సపోర్ట్‌తోనే నటిస్తున్నాను. మా అమ్మ నా ఫొటోలు పంపించడం వల్ల మలయాళంలో నా మొదటి సినిమా ఛాన్స్ వచ్చింది. అప్పుడు నేను టెన్త్ క్లాస్. టెన్త్ క్లాస్ లోనే హీరోయిన్ గా చేశాను. ఇటీవలే రెండు నెలల క్రితమే డిగ్రీ పూర్తయింది. తర్వాత కూడా ఇంకా చదువుతాను అని తెలిపింది.

అలాగే.. ఈ సినిమాలో హరీష్ శంకర్ సర్ తో కొన్ని సీన్స్ ఉన్నాయి. ఆయనతో వర్క్ చేయడం బాగుంది. డైరెక్టర్ మారుతీ, అనిత మేడంతో మాత్రం నాకు సీన్స్ లేవు. సెట్ లో మొదట భాష పరంగా ఇబ్బంది పడ్డాను కానీ తర్వాత తెలుగు నేర్చుకోవడం మొదలుపెట్టాను. తెలుగులో కొన్ని కథలు వింటున్నాను ప్రస్తుతానికి ఇంకా ఏది ఫైనల్ చేయలేదు అని తెలిపింది మాళవిక మనోజ్‌.

 

Also Read : Smriti Irani : మళ్లీ బుల్లితెరపైకి కేంద్ర మాజీ మంత్రి.. 25 ఏళ్ళ తర్వాత అదే పాత్రతో.. ఫస్ట్ లుక్ లీక్..