Malavika Mohanan Says That True Beauty Lies In A Saree
Malavika Mohanan: మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్ ప్రెజెంట్ జనరేషన్ లో చాలా మందికి క్రష్ గా మారిపోయింది. ఓపక్క గ్లామర్ పాత్రలు చేస్తూనే మరోపక్క ట్రెడిషనల్ లుక్ లో అండగొట్టేస్తుంది ఈ బ్యూటీ. అందుకే, అమ్మడు ఫాలోయింగ్ రోజురోజుకి పెరుగుతోంది. ఇటీవల ఈ అమ్మడు నటించిన మూవీ ది రాజాసాబ్. ఈ సినిమాలో ఈ అమ్మడు ఏకంగా ప్రభాస్ పక్కన నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఈ సినిమాలో కూడా పద్దతిగా చీర కట్టులోనే కనిపించే గ్లామర్ వలకబోసింది ఈ బ్యూటీ.
అయితే, అందం అంటే కేవలం ట్రెండీ బట్టలు, పొట్టి పొట్టి బట్టలు వేసుకోవడం మాత్రమే కాదు అంటుంది ఈ బ్యూటీ. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ అమ్మడు అందానికి తన నిర్వచనాన్ని చెప్పింది. “కొంతమంది ట్రెండీగా కనిపించేందుకు మార్కెట్లోకి వచ్చిన ఫ్యాషన్ మెటీరియల్స్ ను వాడుతూ ఉంటారు. ఇతరగా వస్త్రధారణ మనకు ఈవెంట్స్ ఎక్కువగా కనిపిస్తుంది. కానీ, నేను మాత్రం అలా ట్రెండ్ ఫాలో కాలేను. ఇండియా లాంటి గొప్ప దేశంలో పుట్టాం, ఉంటున్నాం కాబట్టి మన దేశ గౌరవాన్ని కాపాడాల్సిన అవసరం చాలా ఉంది.
అందుకే నేను చీరలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను. చిన్నప్పటి నుంచి చేనేత చీరలు కట్టుకునే అమ్మను చూసి పెరిగాను. అసలైన సౌందర్యం, అందం అంటే ఏంటో అప్పుడే అర్థమైంది. నా దృష్టిలో ఫ్యాషన్ అంటే.. చీర కట్టుకుని, కళ్లకు కాటుక, నుదుటిన ఎర్రని బొట్టు, తల్లో పూలతో నిండుగా కనిపించడమే. నాకు అదే ఫ్యాషన్. అంతకు మించిన గొప్ప ఫ్యాషన్ మరొకటి ఉండదు అని నా భావన” అంటూ చెప్పుకొచ్చింది మాళవిక మోహనన్.
దీంతో మాళవిక(Malavika Mohanan) చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆమె మాటలకూ నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. సినిమా అనేది వృత్తి కాబట్టి ఒకే కానీ బయట చీర కట్టులో కనిపించాలని చెప్పావ్ అంటే నువ్వు చాలా గ్రేట్ మాళవిక అంటూ నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇలాంటి అమ్మాయిలు నేటి సమాజానికి చాలా అవసరం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆమె మాటలకి ఫిదా అవుతున్నారు.