The Rajasaab: ప్రభాస్ ఫ్యాన్స్ స్వీట్ రివేంజ్.. డైరెక్టర్ మారుతీ ఇంటికి వందల ఆర్డర్స్.. ఆయనకు సంబంధం లేదట!

ది రాజాసాబ్(The Rajasaab) దర్శకుడు మారుతీ ఇంటికి వందలాది ఫుడ్ ఆర్డర్స్ చేస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్.

The Rajasaab: ప్రభాస్ ఫ్యాన్స్ స్వీట్ రివేంజ్.. డైరెక్టర్ మారుతీ ఇంటికి వందల ఆర్డర్స్.. ఆయనకు సంబంధం లేదట!

Prabhas fans order food orders for director Maruthi's house. (1)

Updated On : January 25, 2026 / 9:11 AM IST
  • మారుతీ ఇంటికి వందలాది ఆర్డర్స్
  • శనివారం ఏకంగా వందకు పైగా ఆర్డర్స్
  • నాకు సంబంధం లేదన్న మారుతీ

The Rajasaab; పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ ది రాజాసాబ్(The Rajasaab). హారర్ అండ్ కామెడీ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమాను దర్శకుడూ మారుతీ తెరకెక్కించాడు. దాదాపు మూడేళ్ళ పాటు షూటింగ్ చేసుకున్న ఈ సినిమా ఎట్టకేలకు సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల అయ్యింది. అయితే, భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. దాంతో, ప్రభాస్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది ఈ సినిమా.

ది రాజాసాబ్ ప్లాప్ తో ప్రభాస్ ఫ్యాన్స్ చాలా డిజప్పాయింట్మెంట్ లో ఉన్నారు. ఈ విషయంలో దర్శకుడు మారుతీపై సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. అంతేకాదు, ప్రభాస్ కెరీర్ లో ప్రైమ్ టైం మూడేళ్లు వేస్ట్ చేసావ్ అంటూ మారుతీపై కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ప్రభాస్ ఫ్యాన్స్ తమ రివెంజ్ ని ఈసారి కొత్తగా ప్లాన్ చేశారు. మారుతీ ది రాజాసాబ్ ఈవెంట్ లో తన ఇంటి అడ్రెస్ చెప్పిన విషయం తెలిసిందే.

Ananya Nagalla: అబ్బబ్బా అనన్య నాగళ్ల.. అందాలు చూస్తే మతిపోవడం ఖాయం.. ఫొటోలు

రాజసాబ్ మూవీ ఎవరిని డిజప్పాయింట్ చేయదని, ఎవరికైనా అలా అనిపిస్తే నేను ఉండేది కొండాపూర్ లోనే అంటూ అక్కడికి ఎవరైనా రావొచ్చు అని చెప్పాడు. ఇక సినిమాకు ప్లాప్ టాక్ వచ్చినప్పటి నుంచి మారుతీ ఇంటి దగ్గరే తిరుగుతున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. తాజాగా ఆయన ఇంటికి వందలాది ఫుడ్ ఆర్డర్స్ చేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ఒక శనివారం రోజే ఏకంగా వందకు పైగా ఆర్డర్స్ వచ్చాయట స్విగ్గి, జొమాటో నుంచి.

అంతేకాదు, కొంతంది మెడికల్ పరికరాలను కూడా ఆర్డర్ చేశారట. దీంతో, ఆర్డర్స్ తీసుకొని సెక్యూరిటీ ఇబ్బంది పడ్డారట. ఈ విషయం ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ఇక ఈ విషయంపై దర్శకుడు మారుతీ సైతం స్పందించాడు. ‘ఆ ఆర్డర్స్ కి నాకు ఎలాంటి సంబంధం లేదు. కొంతమంది కావాలని ఇవి చేస్తున్నారు. డెలివరీ సంస్థలు ఈ విషయాన్ని తెలుసుకోవాలి’ అంటూ చెప్పుకొచ్చాడు.