Mamukkoya : ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ కమెడియన్ కన్నుమూత..

సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ హాస్య నటుడు ఉన్నట్లు ఉండి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.

Malayala star comedian Mamukkoya passed away

Mamukkoya : సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా మలయాళ హాస్య నటుడు మముక్కోయ తుదిశ్వాస విడిచారు. ఈ సోమవారం (ఏప్రిల్ 24) కేరళ మలప్పురం జిల్లాలో జరుగుతున్న ఫుట్ బాల టోర్నమెంట్ కి ఆయన హాజరయ్యారు. ఆ కార్యక్రమంలో మముక్కోయ ఉన్నట్లు ఉండి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో ఆయనని వెంటనే హాస్పిటల్ కి తరలించారు. కేరళ కోజికోడ్ లోని ఒక ఆసుపత్రిలో అత్యవసర చికిత్స విభాగంలో ఆయనని అడ్మిట్ చేశారు.

Agent – Custody : ఏజెంట్, కస్టడీ చిత్రాల విజయం కోసం.. తిరుమలకు నాగార్జున, అమల..

వైద్యులు మముక్కోయకు అవసరమైన ట్రీట్మెంట్ అధించినప్పటికీ ఆయన కోలుకోలేకపోయారు. దీంతో ఈరోజు (ఏప్రిల్ 26) 77 వయసులో మముక్కోయ తుది శ్వాస విడిచాడు. ఇక ఈ వార్తతో మలయాళ పరిశ్రమల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మరణం పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 1979 లో తన యాక్టింగ్ కెరీర్ ని స్టార్ట్ చేసిన మముక్కోయ.. మలయాళ పరిశ్రమలో స్టార్ కమెడియన్ గా పేరుని సంపాదించుకున్నారు.

Samantha : సమంతకు గుడి కడుతున్న వీరాభిమాని.. బర్త్ డే రోజు ఓపెనింగ్!

దాదాపు 450 కి పైగా మలయాళ చిత్రాల్లో ఆయన నటించారు. మముక్కోయ మలయాళ ఇండస్ట్రీతో పాటు కన్నడ, తమిళ పరిశ్రమలో ఎక్కువ సినిమాల్లో కనిపించారు. ఆయన నటనకు రెండు రాష్ట్రాల అవార్డులను అందుకున్నారు. తెలుగు ఆడియన్స్ కూడా రెండు డబ్బింగ్ సినిమాలతో పరిచయం అయ్యారు. దుల్కర్ సల్మాన్ జనతా హోటల్, మోహన్ లాల్ కనుపాప చిత్రాల్లో ముఖ్య పాత్రలు చేసి టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయ్యారు.