Renjusha Menon : మలయాళ నటి అనుమానాస్పద మరణం..

సినిమాలు, టీవీ సీరియల్స్ తో మలయాళంలో మంచి గుర్తింపు సంపాదించుకున్న మలయాళ నటి రెంజూషా మీనన్ అక్టోబర్ 30న ఆమె ఇంటిలో నిర్జీవ స్థితిలో కనిపించారు.

Malayala TV and Cinema actress Renjusha Menon passed away

Renjusha Menon : సినిమాలు, టీవీ సీరియల్స్ తో మలయాళంలో మంచి గుర్తింపు సంపాదించుకున్న మలయాళ నటి రెంజూషా మీనన్ అక్టోబర్ 30న ఆమె ఇంటిలో నిర్జీవ స్థితిలో కనిపించారు. ఆమె తన భర్త, తల్లిదండ్రులతో కలిసి కేరళ తిరువనంతపురంలో కరియమ్‌లోని ఒక ఫ్లాట్ లో ఉంటున్నట్లు సమాచారం. అయితే ఈ సోమవారం నాడు ఆమె ఇంటిలో మరణించి కనిపించడం కుటుంబసభ్యులను, ఫిలిం ఇండస్ట్రీ మెంబర్స్ ని షాక్ కి గురి చేస్తుంది.

Also read : Kaithi 2 : ఖైదీ సీక్వెల్‌లో LCU పాత్రలు అన్ని కనిపించబోతున్నాయి.. లోకేష్ కనగరాజ్

రెంజూషా మీనన్ మరణానికి గల కారణం ఏంటనేది తెలియాల్సి ఉంది. ఈ మృతిపై కేరళ పోలీసులు ఆల్రెడీ విచారణ మొదలు పెట్టారు. కాగా రెంజూషా మీనన్ మలయాళ సినిమా, సీరియల్స్‌లో యాక్ట్ చేస్తుండడమే కాకుండా టెలివిజన్ సీరియల్స్‌లో లైన్ ప్రొడ్యూసర్‌గా కూడా పనిచేసిందని, గత కొన్ని నెలలుగా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోందని వార్తలు వినిపిస్తున్నాయి. మలయాళ మీడియా వర్గాల్లో వినిపిస్తున్న వార్త.