రోడ్డు ప్రమాదంలో యువ నటుడు దుర్మరణం

యువ నటుడు బేసిల్ జార్జ్ రోడ్డు ప్రమాదంలో మరణించాడు..

  • Published By: sekhar ,Published On : May 5, 2020 / 01:34 PM IST
రోడ్డు ప్రమాదంలో యువ నటుడు దుర్మరణం

Updated On : May 5, 2020 / 1:34 PM IST

యువ నటుడు బేసిల్ జార్జ్ రోడ్డు ప్రమాదంలో మరణించాడు..

వరుస మరణాలు సినీ పరిశ్రమవారిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితిలో కనీసం చివరి చూపుకు కూడా నోచుకోలేకపోవడం దురదృష్టకరం. ఇర్ఫాన్ ఖాన్, రిషి కపూర్, సింగర్‌, నటుడు అర్జున్‌ కనుంగో తండ్రి, బాలీవుడ్ ప్రముఖ నిర్మాత, ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా CEO కుల్మీత్ మక్కర్, ప్రముఖ రచయిత, దర్శకుడు అనిల్ అజితాబ్ తదితరుల మరణంతో సినీ పరిశ్రమ షాక్‌లో ఉండగానే మరో యువ నటుడు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడనే వార్తతో పరిశ్రమ వర్గాలు ఉలిక్కి పడ్డాయి.

మలయాళ ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటున్న బేసిల్ జార్జ్ యాక్సిడెంట్‌లో మరణించాడు. జార్జ్ అతని ముగ్గురు స్నేహితులు, డ్రైవర్తో కలిసి కార్‌లో కొలెంచెర్రీ నుండి ఎర్నాకులం జిల్లా మువత్తపుజా వైపు వెళ్తుండగా కార్ అదుపుతప్పి ఎదురుగా ఉన్న షాప్, ఓ ఇంటిని ఢీ కొట్టింది. ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హాస్పిటల్‌కు తరలిస్తుండగా జార్జ్, అతని స్నేహితులు నిధిన్, అశ్విన్ మరణించారు. సంఘటనా స్థలంలో ఉన్న వలస కార్మికులు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. 

Basil George