Malayalam author and director MT Vasudevan Nair dies at 91
మలయాళ సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ రచయిత, దర్శకుడు ఎంటీ వాసుదేవన్ నాయర్ కన్నుమూశారు. బుధవారం రాత్రి కోజికోడ్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన వయస్సు 91 సంవత్సరాలు. వయోభారం వల్ల వచ్చిన సమస్యలతో ఆయన బాధపడుతుండడంతో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
1933 జూలై 15న వాసుదేవన్ నాయర్ పాలక్కాడ్ సమీపంలోని కడలూరులో జన్మించారు. చిన్నతనం నుంచే ఆయనకు సాహిత్యం పై ఎంతో ఆసక్తి ఉండేది. ఆయన రచించిన నాలుకెట్టు, అసురవిత్తు, మంజు, సర్పవిత్తు తదితర రచనలు పాఠకుల ఆదరణను పొందాయి. కొంత కాలం పాటు ఉపాధ్యాయుడిగా పని చేసిన ఆయన తరువాత 1960వ దశకంలో ఆయన మలయాళ సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు. దాదాపు 54 చిత్రాలకు ఆయన స్ర్కీన్‌ప్లే అందించారు.
Actress Divi : నటి ‘దివి’ కాలికి ఏమైంది.. కాలికి కట్టు వేసుకున్న ఫొటోలు షేర్ చేసి..
ఆయన పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన దర్శకత్వం వహించిన నిర్మాల్యం, కడవు వంటి సినిమాలకు ఉత్తమ చిత్రం విభాగంలో జాతీయ చలనచిత్ర పురస్కారాలు దక్కాయి. నాలుగు సార్లు ఆయన ఉత్తమ స్ర్కీన్‌ప్లే రచయితగా జాతీయ అవార్డును అందుకున్నారు.
1995లో కేంద్రం జ్ఞానపీఠ అవార్డును బహూకరించింది. 2005లో పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు.
Venu Swamy – Allu Arjun : అల్లు అర్జున్ జాతకం అప్పటిదాకా బాగోలేదు.. బన్నీ జాతకం చెప్పిన వేణుస్వామి..
వాసుదేవన్ నాయర్ 1965లో రచయిత్రి, అనువాదకురాలు ప్రమీలను వివాహం చేసుకున్నారు. 11 సంవత్సరాల వైవాహిక జీవితం అనంతరం వీరిద్దరు విడిపోయారు. సరవతిని వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు.. సితార, అశ్వతి.
వాసుదేవన్ నాయర్ (91) మృతి పట్ల కేరళ సీఎం విజయన్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈరోజు, రేపు సంతాప దినాలుగా ప్రకటించారు.