Man Of Masses NTR New Advertisement Video goes Viral
NTR : సెలబ్రిటీలు అంతా ఓ పక్క సినిమాలు చేస్తూ మరో పక్క బిజినెస్ లు చేస్తూ మధ్య మధ్యలో యాడ్స్ చేస్తూ బిజీగా ఉంటూనే బాగానే సంపాదిస్తారు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఇప్పటికే పలు యాడ్స్ చేయగా తాజాగా మరో కొత్త యాడ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
గ్రాసరీ సరుకులు సరఫరా చేసే ఆన్లైన్ బిజినెస్ జెప్టో కంపెనీకి ఎన్టీఆర్ కొత్త యాడ్ చేసారు. ఈ యాడ్ లో ఎన్టీఆర్ నెలకు సరిపడా ఒకేసరి సరుకులు కొనుక్కున్నట్టు, పక్కింటి వాళ్లకు కూడా ధరలు తక్కువ ట్రై చేయండి అని చెప్పినట్టు చూపించారు. ఈ యాడ్ లో ఎన్టీఆర్ ఫ్రిడ్జ్ లో కూర్చొని, వాషింగ్ మెషిన్ లో ఉన్నట్టు కూడా సరదాగా చూపించారు.
ప్రస్తుతం ఫ్యాన్స్ ఎన్టీఆర్ కొత్త యాడ్ ని వైరల్ చేస్తున్నారు. మీరు కూడా ఈ కొత్త యాడ్ చూసేయండి..
Zepto Supersaver lo savings jathara inka modhalindi! pic.twitter.com/ZASSjLUOIh
— Zepto (@ZeptoNow) March 7, 2025