Rukshar Dhillon : వద్దని చెప్పినా ఫోటోలు తీస్తున్నారు.. హీరోయిన్ రుక్సర్‌ థిల్లాన్ ఎవరిపై ఫైర్ అయింది? క్లారిటీ ఇదే..

తాజాగా హీరోయిన్ రుక్సార్ థిల్లాన్ ఓ ఈవెంట్ లో ఇలా ఫోటోలు తీయడంపై మండి పడింది.

Rukshar Dhillon : వద్దని చెప్పినా ఫోటోలు తీస్తున్నారు.. హీరోయిన్ రుక్సర్‌ థిల్లాన్ ఎవరిపై ఫైర్ అయింది? క్లారిటీ ఇదే..

Rukshar Dhillon Fires on Who Take Pictures in Event Comments goes Viral

Updated On : March 7, 2025 / 3:09 PM IST

Rukshar Dhillon : సాధారణంగా సినిమా ఈవెంట్స్ లో సెలబ్రిటీలు వస్తే ఫోటోలు ఫోటోగ్రాఫర్స్ తో పాటు అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా సెలబ్రిటీలను ఫోటోలు తీస్తారు. సెలబ్రిటీలు ఫోటోలకు పోజులు ఇస్తారు. అయితే తాజాగా హీరోయిన్ రుక్సార్ థిల్లాన్ ఓ ఈవెంట్ లో ఇలా ఫోటోలు తీయడంపై మండి పడింది.

Also Read : అన్ని థియేటర్లలో అన్ని షోలకు టికెట్ ధర రూ.200.. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఓటీటీ.. పూర్తి వివరాలు

కిరణ్‌ అబ్బవరం, రుక్సర్‌ థిల్లాన్ జంటగా తెరకెక్కుతున్న ‘దిల్‌ రూబా’ సినిమా మార్చ్ 14న రానుంది. నిన్న ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో రుక్సర్‌ థిల్లాన్ మాట్లాడుతూ.. నేను సౌకర్యంగా లేను అని చెప్పినా కొంతమంది ఫోటోలు తీస్తున్నారు. వద్దని చెప్పినా ఫొటోలు తీయడం రైటా? తప్పా? ఫోటోలు తీయొద్దు అని ప్రేమగా చెప్పినా వినిపించుకోలేదు. వాళ్ళ పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు అని చెప్పింది.

దీంతో రుక్సర్‌ థిల్లాన్ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. అయితే ఈ వ్యాఖ్యలు ఒక సీనియర్ జర్నలిస్ట్ ని ఉద్దేశించి చేసిందని పలువురు భావించారు. ఆ సీనియర్ జర్నలిస్ట్ రెగ్యులర్ గా సినిమా ఈవెంట్, సినిమాలలో హీరోయిన్స్ ని ఫోటోలు తీసి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటాడు. గతంలో దిల్ రూబాకు చెందిన ఈవెంట్లోనే రుక్సర్‌ థిల్లాన్ క్లోజ్ ఫోటో ఒకటి తీసి పెట్టాడు. రుక్సర్‌ ఇతన్నే అంటుందని అంతా అనుకున్నారు. అయితే హీరో కిరణ్ అబ్బవరం దీనికి, ఆ సీనియర్ జర్నలిస్ట్ కి ఏం సంబంధం లేదు అని క్లారిటీ ఇస్తూ ట్వీట్ కూడా చేసాడు.

అసలేం జరిగిందంటే..

సాధారణంగా సినిమా ఈవెంట్స్ కి వచ్చినప్పుడు హీరో, హీరోయిన్స్ ని ఫోటోలు తీస్తారు. అందుకు అన్ని మీడియాల నుంచి ఫోటోగ్రాఫర్స్ వస్తారు. ఇది ప్రతి ఈవెంట్లో జరిగేదే. అయితే నిన్న దిల్ రుబా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో కూడా రుక్సర్‌ థిల్లాన్ ని ఫొటోలు తీయబోతే ఈ డ్రెస్ కంఫర్ట్ గా లేదు, ఇందులో ఫోటోలు వద్దు అని చెప్పిందట. దీంతో స్టేజిపై గ్రూప్ ఫొటోల్లో కూడా ఆమెని పక్కకి తప్పించి ఫోటోలు తీసారట. దీనికి రుక్సర్‌ థిల్లాన్ అలిగి ఇలా మాట్లాడిందట అని పలువురు ఈవెంట్ కి వెళ్ళినవాళ్ళు అంటున్నారు.

Also Read : Chhaava : సూపర్ హిట్ ‘ఛావా’ మూవీ రివ్యూ.. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీ మహారాజ్ కథ..

దీనిగురించి ఆ ఫొటోగ్రాఫర్లు.. రుక్సర్‌ గతంలో కూడా ఇలాగే ప్రవర్తించింది, ఈవెంట్ కి వచ్చేదే మేము సెలబ్రిటీల ఫోటోలు తీయడానికి, వాళ్లకు పబ్లిసిటీ ఇవ్వడానికి, వాళ్లే కవరేజ్ వద్దు అన్నప్పుడు మాకు వాళ్ళ ఫోటోలు ఎందుకు అని అక్కడ మీడియాతో అన్నారట.

ప్రస్తుతానికి అయితే రుక్సర్‌ థిల్లాన్ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఒక్కొక్కరు ఒక్కో వర్షన్ చెప్పడంతో ప్రస్తుతం మీడియాలో రుక్సర్‌ థిల్లాన్ చర్చగా మారింది.