Man Recreates Shah Rukh Khan Jawan
Viral Video – Jawan: బాలీవుడ్ (Bollywood) హీరో షారుక్ ఖాన్ (Shah Rukh Khan) తాజా చిత్రం జవాన్‌లో ట్రైన్ సీన్ ఉంటుంది. అందులో షారుక్ ఖాన్ ఒంటి నిండా గాయాలయినట్లు వేషం వేసి ట్రైనులో పడుకుంటాడు. అచ్చం అటువంటి లుక్ లోనే ఓ యువకుడు రైల్వే స్టేషన్లో కనపడ్డాడు.
సినిమాలో షారుక్ ట్రైనులో పడుకునే పోజులోనే ఈ యువకుడు కూడా ట్రైనులో పడుకుంటాడు. అతడు తల, చేతులకు కట్లతో ట్రైను ఎక్కుతుంటే అక్కడున్న వారు అందరూ అతడినే చూస్తుండిపోయారు. ఆ సీన్ ను రీక్రియేట్ చేసిన ఈ యువకుడు ఇందుకు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు.
ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అచ్చం షారుక్ ఖాన్ లా చేశాడని ఆ యువకుడిపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. కాగా, జవాన్ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసుకున్న విషయం తెలిసిందే. పఠాన్ తర్వాత షారుక్ ఖాన్ ఖాతాలో మరో భారీ విజయం పడడంతో అతడి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
Nayanthara : దర్శకుడు అట్లీ పై నయనతార అసంతృప్తి..? కారణం దీపికేనా..?