Manchu Family
మంచు ఫ్యామిలీలో హైడ్రామా కొనసాగుతోంది. నిన్న ఓ ప్రైవేటు ఆస్పత్రిలో మోహన్ బాబు చిన్న కుమారుడు మంచు మనోజ్ వైద్య పరీక్షలు చేయించుకున్నారు. మనోజ్ ఒంటిమీద గాయలైనట్లు వైద్యులు నిర్థారించినట్లుగా తెలుస్తోంది. ఆస్తుల పంపకాల విషయంలో మంచు ఫ్యామిలీలో గొడవ జరిగినట్లుగా వార్తలు వస్తున్నాయి.
మంచు మనోజ్ పై దాడి నేపథ్యంలో మంచు విష్ణు దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు వచ్చారు. జల్‌పల్లిలోని మంచు మోహన్ బాబు ఇంటికి కాసేపట్లో చేరుకోనున్నారు. ఈ క్రమంలో మోహన్ బాబు ఇంటికి పోటాపోటీగా బౌన్సర్లు చేరుకున్నారు.
Allu Arjun : అల్లు అర్జున్ పై అమితాబ్ బచ్చన్ ప్రశంశలు.. బన్నీ ఏం చెప్పాడంటే…
విష్ణు తరుపున 40 మంది బౌన్సర్లు, మనోజ్ తరుపున 30 మంది బౌన్సర్లు మోహన్ బాబు నివాసానికి చేరుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
కాగా.. విష్ణు తరుపు బౌన్సర్లను మోహన్ బాబు ఇంటిలోకి అనుమతించారు. అదే సమయంలో మనోజ్ తరుపు బౌన్సర్లను అనుమతించలేదు సెక్యూరిటీ సిబ్బంది. దీంతో వారంతా మోహన్ బాబు ఇంటి ముందే వేచిఉన్నారు. ఇక విష్ణు ఇంటికి చేరుకున్నాక.. అక్కడ పెద్ద ఎత్తున గొడవ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే మంచు లక్ష్మీ మోహన్ బాబు నివాసానికి చేరుకున్నారు.