RRR Documentary : వావ్.. RRR మేకింగ్ పై డాక్యుమెంటరీ.. ఎప్పుడు వస్తుందో తెలుసా? ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్ వెయిటింగ్..

రాజమౌళిపై ఇప్పటికే డాక్యుమెంటరీ రాగా ఇప్పుడు RRR మేకింగ్ పై డాక్యుమెంటరీ రాబోతుంది.

RRR Documentary : వావ్.. RRR మేకింగ్ పై డాక్యుమెంటరీ.. ఎప్పుడు వస్తుందో తెలుసా? ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్ వెయిటింగ్..

RRR Documentary Announced by movie team Details Here

Updated On : December 9, 2024 / 12:12 PM IST

RRR Documentary : RRR సినిమా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. రాజమౌళి దర్శకత్వంలో ఇద్దరు స్టార్ హీరోలు కలిసి భారీ మల్టీస్టారర్ గా తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయం సాధించడమే కాక ఇంటర్నేషనల్ వైడ్ ఇండియన్ సినిమాకు గుర్తింపు తెచ్చింది. ఏకంగా ఈ సినిమాకు ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది. బోలెడన్ని ఇంటర్నేషనల్ అవార్డులు, కలెక్షన్స్ రికార్డులు సాధించిన ఈ సినిమా రాజమౌళి, చరణ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి చాలా స్పెషల్.

Also Read : The Girlfriend : రష్మిక మందన్న ‘ది గర్ల్ ఫ్రెండ్’ టీజర్ రిలీజ్.. విజయ్ దేవరకొండ వాయిస్ తో అదిరిందిగా..

రాజమౌళిపై ఇప్పటికే డాక్యుమెంటరీ రాగా ఇప్పుడు RRR మేకింగ్ పై డాక్యుమెంటరీ రాబోతుంది. RRR సినిమా రిలీజ్ కి ముందు మేకింగ్, ప్రీ ప్రొడక్షన్, రిలీజ్ తర్వాత సినిమా సాధించిన విజయాలతో ఓ డాక్యుమెంటరీని రూపొందిస్తున్నారట. ఈ డాక్యుమెంటరీ డిసెంబర్ లోనే రిలీజ్ కానున్నట్టు RRR టీమ్ అధికారికంగా ప్రకటించారు. దీనికి సంబంధించి RRR టైటిల్ తో రాజమౌళి ఉన్న ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేసారు.

RRR Documentary

దీంతో RRR డాక్యుమెంటరీ పై ఆసక్తి నెలకొంది. చరణ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ డాక్యుమెంటరీ కోసం ఆతృతగా ఎదురుచూస్తుంటే సినీ లవర్స్ కూడా ఈ డాక్యుమెంటరీలో ఏం చూపిస్తారో అని వెయిట్ చేస్తున్నారు. ఈ డాక్యుమెంటరీ డిసెంబర్ లో ఏ డేట్ లో వస్తుందో త్వరలోనే ప్రకటించనున్నారు. ఈ డాక్యుమెంటరీ నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో వచ్చే అవకాశం ఉంది.