Manchu Lakhsmi : నెల్లూరులో గవర్నమెంట్ స్కూల్ పిల్లలతో మంచు లక్ష్మి.. తన ఎన్జీఓ సంస్థ నుంచి..

తాజాగా టీచ్ ఫర్ చేంజ్ ఫౌండేషన్ ద్వారా..

Manchu Lakhsmi

Manchu Lakhsmi : మంచు లక్ష్మి గత కొన్నేళ్లుగా తన టీచ్ ఫర్ చేంజ్ ఎన్జీవో సంస్థ ద్వారా తెలుగు రాష్ట్రాల్లోని గవర్నమెంట్ పాఠశాలలకు డిజిటల్ క్లాస్ రూమ్స్, అక్కడ స్కూల్ లో కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేస్తుంది. తాజాగా టీచ్ ఫర్ చేంజ్ ఫౌండేషన్ ద్వారా నెల్లూరు జిల్లాలోని 12 పాఠశాలలలో డిజిటల్ క్లాస్ రూమ్ ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది మంచు లక్ష్మి.

ఈ క్రమంలో నెల్లూరు కోటమిట్ట కృష్ణ మందిరం వీధిలోని మున్సిపల్ కార్పొరేషన్ ప్రైమరీ స్కూల్ లో ఈ కార్యక్రమం ప్రారంభానికి మంచు లక్ష్మి హాజరైంది. మంచు లక్ష్మి అక్కడి లోకల్ నాయకులతో కలిసి ఆ స్కూల్ లో డిజిటల్ క్లాస్ రూమ్స్ ప్రారంభించింది.

Also Read : Kingdom : వైజాగ్ సముద్రంలో ఎవరికీ తెలియని ఐలాండ్ లో ‘కింగ్డమ్’ షూట్.. బడ్జెట్ ఎన్ని కోట్లు తెలుసా?

అనంతరం మంచు లక్ష్మి మీడియాతో మాట్లాడుతూ.. ప్రైవేట్ పాఠశాల విద్యకు ప్రభుత్వ పాఠశాలల విద్యకు వ్యత్యాసం కనిపిస్తుండడంతో ఆ వ్యత్యాసాన్ని తొలగించడమే లక్ష్యంగా మా ఎన్జీవో సంస్థ ద్వారా కార్యక్రమాలను చేపడుతున్నాము. ఇప్పటికే 12 పాఠశాలలలోనూ డిజిటల్ క్లాస్ రూమ్ ల ఏర్పాటు పూర్తయింది అని తెలిపారు.