Kingdom : వైజాగ్ సముద్రంలో ఎవరికీ తెలియని ఐలాండ్ లో ‘కింగ్డమ్’ షూట్.. బడ్జెట్ ఎన్ని కోట్లు తెలుసా?
తాజాగా కింగ్డమ్ సినిమా నిర్మాత నాగవంశీ ఓ ఇంటర్వ్యూలో సినిమా గురించి పలు ఆసక్తికర అంశాలు తెలిపారు.

Kingdom
Kingdom : విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమా జులై 31న రాబోతుంది. శ్రీలంక బ్యాక్ డ్రాప్ లో బ్రదర్ ఎమోషన్ తో ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, సాంగ్స్ రిలీజ్ చేసారు. ట్రైలర్ జులై 26 రిలీజ్ చేస్తారని ప్రకటించారు. తాజాగా కింగ్డమ్ సినిమా నిర్మాత నాగవంశీ ఓ ఇంటర్వ్యూలో సినిమా గురించి పలు ఆసక్తికర అంశాలు తెలిపారు.
కింగ్డమ్ షూటింగ్ ని ఎక్కడెక్కడ షూట్ చేసారు అని అడగ్గా నాగవంశీ సమాధానమిస్తూ.. వైజాగ్ లో సముద్రం లోపలికి కొంచెం దూరం వెళ్తే అక్కడ ఒక ఐలాండ్ ఉంది. ప్రైవేట్ వాళ్ళ దగ్గర ఆ ఐలాండ్ ఉంది. అక్కడ పర్మిషన్ తీసుకొని షూటింగ్ చేసాము. అక్కడ ఐలాండ్ ఉందని కూడా చాలా మందికి తెలియదు. అలాగే శ్రీలంకలో చాలా భాగం షూట్ చేసాము. హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో సెట్ వేసి కొన్ని సీన్స్ చేసాము అని తెలిపారు.
Also Read : Kingdom : ‘కింగ్డమ్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ డేట్ అనౌన్స్.. భారీగా ఈవెంట్.. ఎప్పుడు? ఎక్కడ?
ఇక ఈ సినిమా బడ్జెట్ గురించి మాట్లాడుతూ.. దాదాపు 130 కోట్ల బడ్జెట్ అయింది సినిమాకు. మొదట అనుకున్న దానికి ఆల్మోస్ట్ ఒక 15 శాతం వరకు పెరిగింది అని తెలిపారు.