Manchu Lakshmi : నీకేంట్రా నొప్పి.. నువ్వేమన్నా డబ్బులిచ్చావా? నా సంపాదన నా ఇష్టం.. నెటిజన్స్ పై మంచు లక్ష్మి ఫైర్..
మంచు లక్ష్మి ఆ కామెంట్స్ చేసిన వారిపై ఫైర్ అవుతూ ఓ వీడియో పెట్టింది.

Manchu Lakshmi fires on Who trolls her about recent Tweets
Manchu Lakshmi : మంచు ఫ్యామిలీ ఎప్పుడూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. వాళ్ళ సినిమాలతోనో, ట్వీట్స్ తోనో, స్పీచ్ లతోనో, ఇంటర్వ్యూలతోనో మంచు ఫ్యామిలిలో ఎవరో ఒకరు ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటారు. ఇటీవలే ఏపీ పాలిటిక్స్ పై ట్వీట్ చేసి వైరల్ అయిన మంచు లక్ష్మి తాజాగా మరో వీడియోతో వైరల్ అవుతుంది.
ఇటీవల మంచు లక్ష్మి విమానాశ్రయంలో కార్పెట్ శుభ్రంగా రాలేదని ఒక వీడియో తీసి ఐ ఫోన్ తో తీశాను కాబట్టి ఇంకా క్లారిటీగా వచ్చింది అని పోస్ట్ చేసింది ట్విట్టర్ లో. దీంతో కొంతమంది నువ్వు ఐ ఫోన్ వాడుతున్నావా? ఫ్లైట్ లో బిజినెస్ క్లాస్ లో ప్రయాణిస్తావా? బాగా డబ్బులున్నోళ్లు అంటూ కామెంట్స్ చేశారు నెటిజన్లు. దీంతో మంచు లక్ష్మి ఆ కామెంట్స్ చేసిన వారిపై ఫైర్ అవుతూ ఓ వీడియో పెట్టింది.
Also Read : Bigg Boss 7 Day 19 : యావర్ ని ఏడిపించిన అమ్మాయిలు.. మూడో పవరాస్త్ర ఎవరు గెలుచుకున్నారు?
మంచు లక్ష్మి ఈ వీడియోలో.. నేనేదో వీడియో పెడితే దానికి మీరు ఇష్టమొచ్చినట్టు కామెంట్స్ పెడతారు. నేను ఐ ఫోన్ వాడకూడదా? నేను బిజినెస్ క్లాస్ లలో తిరగకూడదా? నీకేంట్రా నొప్పి? నువ్వేమన్నా ఇస్తున్నావా డబ్బులు? నువ్వేమన్నా కొనిచ్చావా? నా సంపాదన నా ఇష్టం. నాకు సొంతంగా విమానం కావాలి. మీకు వద్దా? మీరు పెద్దగా ఆలోచించరా? మీకు అన్ని తప్పులే కనిపిస్తున్నాయి. ఒక మహిళ ఏం మాట్లాడకూడదు, ఏం చెప్పకూడదు, ఏం పోస్ట్ చేయకూడదు. మీ సమస్య ఏంటి? నేను డబ్బులు సంపాదించడానికి చాలా కష్టపడతాను. మా అమ్మానాన్నలు నాకు డబ్బులు ఇవ్వరు. కష్టపడటం నేర్పించారు అంటూ ఫైర్ అయింది. దీంతో మంచు లక్ష్మి వీడియో వైరల్ గా మారింది.
Money for me buys me freedom not happiness! https://t.co/5BTXDPXNNM pic.twitter.com/5lZcqyEHrt
— Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) September 22, 2023