manchu manoj and mounika appears out side first time after marriage
Manoj-Mounika : మంచు మనోజ్(Manchu Manoj) గత కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. మొదటి భార్యకు గతంలో విడాకులు ఇచ్చాడు. ఇటీవలే తన రాబోయే సినిమాని ప్రకటించి రెండో పెళ్లి కూడా చేసుకున్నాడు. ప్రముఖ దివంగత రాజకీయ నాయకుడు భూమా నాగిరెడ్డి కూతురు భూమా మౌనికని(Bhuma Mounika) మార్చ్ 3 శుక్రవారం రాత్రి వివాహం చేసుకున్నాడు మనోజ్. వీరిద్దరిది ప్రేమ వివాహం కావడం విశేషం. ఈ వివాహం హైదరాబాద్ లోని మనోజ్ ఇంట్లోనే జరిగింది. ఇద్దరికీ ఇది రెండో వివాహం కావడంతో కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్యే వివాహం చేసుకున్నారు.
వివాహం తర్వాత మౌనిక సొంతూరు ఆళ్లగడ్డకు వెళ్లారు. ఆ తర్వాత మళ్ళీ ఈ జంట బయట కనపడలేదు. తాజాగా మోహన్ బాబు యూనివర్సిటీ 31వ వార్షికోత్సవ వేడుకలను తిరుపతిలో నిర్వహించగా మోహన్ బాబు కుటుంబ సభ్యులు అందరూ విచ్చేశారు. ఈ నేపథ్యంలో మంచు మనోజ్ కూడా తన భార్య మౌనికతో కలిసి ఈ వేడుకలకు హాజరయ్యారు. ఇద్దరూ కలిసి వచ్చి ముందు వరుసలో కూర్చున్నారు.
Mohan Babu University 31st Anniversary : మోహన్ బాబు యూనివర్సిటీ 31వ వార్షికోత్సవం గ్యాలరీ..
దీంతో ఈ జంట ఫోటోలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ కొత్త జంట చూడముచ్చటగా ఉందని అభిమానులు, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ ఈవెంట్ కి మౌనిక పద్దతిగా చీరలో వచ్చి అందరిని మెప్పించింది. మంచు విష్ణు భార్య విరోనికా కూడా రాగా తాను కొంచెం మోడ్రన్ గా లాంగ్ ఫ్రాక్ లో వచ్చింది.