Vishnu Vs Manoj : మంచు విష్ణు ‘కన్నప్ప’కు పోటీగా మంచు మనోజ్ సినిమా.. అన్నదమ్ముల వార్.. బుల్లితెరపై కాదు వెండితెరపై చూసుకుందాం..
అన్న మంచు విష్ణు కన్నప్పకి పోటీగా మంచు మనోజ్ రాబోతున్నట్టు తెలుస్తుంది.

Manchu Manoj Bhairavam Movie Compete with Manchu Vishnu Kannappa Movie Rumors goes Viral
Vishnu Vs Manoj : గత కొన్నాళ్లుగా మంచు కుటుంబంలో వివాదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా మంచు మనోజ్ వర్సెస్ మంచు ఫ్యామిలీ అన్నట్టు సాగుతున్నాయి. ఆస్తుల కోసం అని, విద్యాసంస్థల్లో జరుగుతున్న సమస్యల గురించి అని మోహన్ బాబు, మనోజ్ ఎవరి వర్షన్ వారు వినిపిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ వార్ సినిమాలతో ముడిపడింది.
మంచు విష్ణు కన్నప్ప సినిమాని దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో భారీగా తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది సినిమా. కన్నప్ప సినిమాలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, మధుబాల, శరత్ కుమార్, కాజల్.. ఇలా చాలా మంది స్టార్స్ నటిస్తున్నారు. కన్నప్ప సినిమాని ఏప్రిల్ 25న రిలీజ్ చేయనున్నారు.
అయితే ఇప్పుడు అన్న మంచు విష్ణు కన్నప్పకి పోటీగా మంచు మనోజ్ రాబోతున్నట్టు తెలుస్తుంది. మంచు మనోజ్, నితిన్, బెల్లంకొండ శ్రీనివాస్.. ముగ్గురు కలిసి భారీ మల్టీస్టారర్ గా భైరవం సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించలేదు కానీ ఏప్రిల్ లో వస్తాం అని ప్రకటించారు.
అయితే ఇటీవల మంచు మనోజ్ ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ టీవీ ఛానల్ ఉగాది ఈవెంట్ కి వెళ్లారు. దాని ప్రోమోని తాజాగా రిలీజ్ చేసారు. ఈ ప్రోమోలో యాంకర్ నందు భైరవం ఎప్పుడు రిలీజ్ అని మంచు మనోజ్ ని అడగ్గా.. ఏప్రిల్ లో వస్తున్నాం తమ్ముడు. చిన్న తెరల్లో కాదు ఈసారి వెండి తెరల్లో చూసుకుందాం అని డిసైడ్ అయ్యాను అని చెప్పాడు.
దీంతో ఇన్ని రోజులు టీవీల్లో మా గురించి వార్తలు వచ్చాయి, ఇప్పుడు వెండితెరపై చేసుకుందని అని, భైరవం సినిమాని కన్నప్పను పోటీగా రిలీజ్ చేస్తాడని అన్నట్టు అందరూ భావిస్తున్నారు. మంచు మనోజ్ కామెంట్స్ వైరల్ అవ్వడంతో కచ్చితంగా భైరవం సినిమాని మంచు విష్ణు కన్నప్పకి పోటిగా రిలీజ్ చేస్తారనే అంటున్నారు. ఇదే జరిగితే కనక ఆ వారం అదిరిపోయే ఫైట్ ఉంటుంది బాక్సాఫీస్ దగ్గర.
గత కొన్నాళ్లుగా ఫ్లాప్స్ చూస్తున్న మంచువిష్ణు స్టార్ కాస్ట్ అందర్నీ పెట్టుకొని కన్నప్పతో వస్తున్నాడు. ఆల్మోస్ట్ ఏడేళ్ల తర్వాత మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తున్నాడు మంచు మనోజ్. దీంతో కన్నప్ప, భైరవం సినిమాలపై మంచి అంచనాలే ఉన్నాయి. మరి ఎవరి సినిమా మెప్పిస్తుందో చూడాలి. నిజంగానే కన్నప్ప – భైరవం ఒకేసారి రిలీజ్ అయి అన్నదమ్ముల వార్ సినిమాల మధ్యకు చేరుతుందా లేక ఎవరైనా వాయిదా వేస్తారా చూడాలి.