Manchu Manoj : రాజకీయాల్లోకి రావడంపై మనోజ్ క్లారిటీ.. దాన్ని మీరేమంటారో మీ ఇష్టం అంటూ..

కొన్ని రోజుల క్రితం మనోజ్ జనసేనలో చేరతాడు అని వార్తలు వచ్చాయి.

Manchu Manoj gives Clarity on his Entry in Politics

Manchu Manoj : గత కొన్ని రోజులుగా మనోజ్, మంచు ఫ్యామిలీ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. మంచు ఫ్యామిలీ గతంలో ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు. అన్ని పార్టీల రాజకీయ నాయకులతో సంబంధాలు ఉన్నాయి. మనోజ్ భార్య మౌనిక కూడా రాజకీయ ఫ్యామిలీ నుంచి వచ్చిన సంగతి తెలిసిందే,. ప్రస్తుతం మౌనిక అక్క భూమా అఖిలప్రియ టీడీపీ తరపున ఎమ్మెల్యేగా ఉంది.

కొన్ని రోజుల క్రితం మనోజ్ జనసేనలో చేరతాడు అని వార్తలు వచ్చాయి. గత ఎన్నికల సమయంలో మనోజ్ భూమా అఖిలప్రియకు ఇండైరెక్ట్ గానే సపోర్ట్ చేసాడు. దీంతో మనోజ్ కూడా రాజకీయాల్లోకి వస్తాడు అని భావించారు. మనోజ్ చాలా గ్యాప్ తర్వాత భైరవం సినిమాతో వస్తున్నాడు. ఈ సినిమా మే 30న థియేటర్స్ లో రిలీజ్ కానుంది. నేడు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మనోజ్ మీడియాతో మాట్లాడగా రాజకీయాల ఎంట్రీ గురించి ప్రశ్న ఎదురైంది.

Also Read : Manchu Manoj : నాకు ‘మా’లో మెంబర్ షిప్ ఇవ్వలేదు.. 8 ఏళ్ళు సినీ పరిశ్రమకు దూరంగా ఉండటంపై మనోజ్ కామెంట్స్..

దీనికి మంచు మనోజ్ సమాధానమిస్తూ.. జనాల అందరి మీద కేర్ చూపిస్తాం, ప్రేమ చూపిస్తాం. అందరూ బాగుండాలి అని కోరుకుంటాం. దాన్ని మీరు పాలిటిక్స్ అంటారో, సోషల్ సర్వీస్ అంటారో, మానవత్వం అంటారో మీ ఇష్టం. జనాల్లో ఉంటేనే నాకు ఇష్టం. అందుకే నేను ఊరికి వెళ్లి రెగ్యులర్ గా అక్కడి జనాలతో కలుస్తాను. అప్పుడప్పుడు పండగలు ఊళ్ళో జనాలతో చేసుకుంటాను. నేను తిరుపతిలో చదివాను. నా భార్య ఆళ్లగడ్డలో చదివింది. మా ఇద్దరికీ పల్లెమూలాలు ఉన్నాయి. వాటికి మేము బాగా కనెక్టెడ్. మా పిల్లలను కూడా అలానే పెంచుతాము. వాళ్ళను ఊరికి తీసుకెళ్లి అక్కడ జరిగేవి అన్ని అర్థమయ్యేలా చెప్తాము. మా జనాలతో, మా ప్రజలతో మేము క్లోజ్ గా ఉంటాము. మా పల్లె, మా ఊరు అని కనెక్షన్ ఉంది అని చెప్పుకొచ్చాడు. అంటే ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకపోయినా జనాల్లోనే ఉంటాను అని చెప్పుకొచ్చాడు మనోజ్.

Also Read : Manchu Manoj : మాదాపూర్ ఆఫీస్ లో కూర్చొని నాపై ట్రోల్స్.. నా భార్య సపోర్ట్ చాలు.. ఇండస్ట్రీలో నాకు ఫోన్ చేసారు కానీ..