Manchu Manoj : మాదాపూర్ ఆఫీస్ లో కూర్చొని నాపై ట్రోల్స్.. నా భార్య సపోర్ట్ చాలు.. ఇండస్ట్రీలో నాకు ఫోన్ చేసారు కానీ..
మనోజ్ మే 30న భైరవం సినిమాతో రాబోతున్నాడు.

Manchu Manoj Comments on Family Issues and Trolls
Manchu Manoj : గత కొన్నాళ్లుగా మంచు ఫ్యామిలిలో వివాదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. మంచు మనోజ్ వర్సెస్ మంచు ఫ్యామిలీ అన్నట్టు ఈ వివాదాలు కొనసాగుతున్నాయి. మోహన్ బాబు, విష్ణు ఇవి ఆస్తి గొడవలు అంటుంటే మనోజ్ మాత్రం కాలేజీకి సంబంధించిన గొడవలు అంటున్నాడు. ఇప్పటికే ఈ ఫ్యామిలీ వివాదం పోలీస్ స్టేషన్, కలక్టరేట్ వరకు వెళ్లి రోడ్డుకెక్కారు. ఒకరిపై ఒకరు పలు ఆరోపణలు కూడా చేసుకుంటున్నారు.
అయితే మనోజ్ మే 30న భైరవం సినిమాతో రాబోతున్నాడు. ఆల్మోస్ట్ 9 ఏళ్ళ గ్యాప్ తర్వాత మనోజ్ సినిమాతో ప్రేక్షకుల ముందు వస్తుండటంతో ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. మనోజ్ కూడా అదే లెవల్లో ప్రమోషన్స్ చేస్తున్నారు. తాజాగా భైరవం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మనోజ్ మీడియాతో మాట్లాడగా.. ఈ వివాదాల సమయంలో మీకు ఎవరూ సపోర్ట్ రాలేదా? మీపై కూడా ట్రోల్స్ వస్తున్నాయి కదా అని అడిగారు.
Also Read : HariHara VeeraMallu : పవన్ హరిహర వీరమల్లు నుంచి మూడో సాంగ్ రిలీజ్ డేట్, టైం అనౌన్స్.. ఎప్పుడో తెలుసా?
దీనికి మనోజ్ సమాధానమిస్తూ.. నాకు నా భార్య మౌనిక సపోర్ట్ సరిపోతుంది. నాకు చాలా మంది ఫోన్స్ చేసారు ఇండస్ట్రీ నుంచి. కానీ ఎవర్ని ఇన్వాల్వ్ చేయదలుచుకోలేదు. నేను ఎవరికీ ఫోన్స్ చేయలేదు. నాకు ఫోన్ చేసిన వాళ్లకు నాకు జరిగింది చెప్పాను. కానీ ఎవర్ని హెల్ప్ అడగలేదు. నేను తప్పు జరిగితే రియాక్ట్ అవుతాను. నాపై ఆరోపణలకు నేను రియాక్ట్ అవ్వకపోతే తప్పు చేసినవాడిని నేనే అవుతాను. తప్పు చేయనప్పుడు నేను ఎక్కడైనా మాట్లాడతాను. ఆయన ఫ్యాన్స్ అంతా ఒక ఆఫీస్ మాదాపూర్ లో కూర్చొని నాపై ట్రోల్స్ చేస్తున్నారు అని చెప్పుకొచ్చాడు.
మాదాపూర్ లో మంచు విష్ణు ఆఫీస్ ఉంది. మనోజ్ వ్యాఖ్యలతో ఆ ఆఫీస్ లో కొంతమంది ఎంప్లాయిస్ ని పెట్టి మరీ మనోజ్ పై ట్రోల్స్ చేస్తున్నారని తెలుస్తుంది.
Also Read : Suriya : తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్న సూర్య.. త్రివిక్రమ్ చేతుల మీదుగా సినిమా ఓపెనింగ్..