HariHara VeeraMallu : పవన్ హరిహర వీరమల్లు నుంచి మూడో సాంగ్ రిలీజ్ డేట్, టైం అనౌన్స్.. ఎప్పుడో తెలుసా?

తాజాగా ఈ సినిమా నుంచి నెక్స్ట్ సాంగ్ అప్డేట్ ఇచ్చారు.

HariHara VeeraMallu : పవన్ హరిహర వీరమల్లు నుంచి మూడో సాంగ్ రిలీజ్ డేట్, టైం అనౌన్స్.. ఎప్పుడో తెలుసా?

Pawan Kalyan HariHara VeeraMallu Movie Third Song Release Update

Updated On : May 19, 2025 / 4:05 PM IST

HariHara VeeraMallu : ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ ఇటీవల హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ పూర్తిచేశారు. దీంతో అయిదేళ్లుగా సాగుతున్న సినిమా రిలీజ్ కి రెడీ అయింది. జూన్ 12న హరిహర వీరమల్లు సినిమా గ్రాండ్ రిలీజ్ చేయబోతున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఫాస్ట్ గా జరుగుతున్నాయి.

ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్, టీజర్, రెండు సాంగ్స్ రిలీజ్ చేసి అంచనాలు పెంచారు. తాజాగా ఈ సినిమా నుంచి నెక్స్ట్ సాంగ్ అప్డేట్ ఇచ్చారు. హరిహర వీరమల్లు సినిమా నుంచి మూడో సాంగ్ ‘అసుర హననం..’ అంటూ సాగే పాటను మే 21న ఉదయం 11 గంటల 55 నిమిషాలకు రిలీజ్ చేయనున్నారు. దీంతో ఈ పాట కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

Pawan Kalyan HariHara VeeraMallu Movie Third Song Release Update

 

అలాగే మే 21 న హరిహర వీరమల్లు కు సంబంధించి మొదటి ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. మే చివర్లో ట్రైలర్ కూడా రిలీజ్ చేయనున్నారు. సాంగ్ రిలీజ్ అనౌన్స్ చేస్తూ పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ పోస్టర్ కొత్తది రిలీజ్ చేసారు.

 

Also Read : Suriya : తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్న సూర్య‌.. త్రివిక్ర‌మ్ చేతుల మీదుగా సినిమా ఓపెనింగ్‌..