Manchu Manoj : నాకు ‘మా’లో మెంబర్ షిప్ ఇవ్వలేదు.. 8 ఏళ్ళు సినీ పరిశ్రమకు దూరంగా ఉండటంపై మనోజ్ కామెంట్స్..

అయితే మంచు ఫ్యామిలీ వివాదాలతో విష్ణు పై డైరెక్ట్ గా, ఇండైరెక్ట్ గా అన్నిచోట్లా కౌంటర్లు వేస్తున్నాడు మనోజ్.

Manchu Manoj : నాకు ‘మా’లో మెంబర్ షిప్ ఇవ్వలేదు.. 8 ఏళ్ళు సినీ పరిశ్రమకు దూరంగా ఉండటంపై మనోజ్ కామెంట్స్..

Manchu Manoj Gives Clarity on His Distance to Movie Industry

Updated On : May 19, 2025 / 4:57 PM IST

Manchu Manoj : మంచు మనోజ్ గత 8 ఏళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. మనోజ్ చివరిసారిగా 2017 లో ఒక్కడు మిగిలాడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ తర్వాత 2018లో ఓ రెండు సినిమాల్లో గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చి మెరిపించాడు. అప్పట్నుంచి మళ్ళీ సినిమాలు చేయలేదు. ఆల్మోస్ట్ 8 ఏళ్ళు దాటేసింది మనోజ్ పూర్తి స్థాయిలో సినిమాలు చేసి.

మధ్యలో ఓ రెండు సినిమాలు ఎనౌన్స్ చేసినా అవి ఆగిపోయాయి. అయితే గత కొన్నాళ్ల నుంచి మనోజ్ మంచు ఫ్యామిలీ వివాదాలతో వార్తల్లో నిలుస్తున్నాడు. అలాగే భైరవం సినిమాతో 8 ఏళ్ళ తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మే 30న భైరవం సినిమా రాబోతుండగా మనోజ్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నాడు. అయితే మంచు ఫ్యామిలీ వివాదాలతో విష్ణు పై డైరెక్ట్ గా, ఇండైరెక్ట్ గా అన్నిచోట్లా కౌంటర్లు వేస్తున్నాడు.

Also Read : Manchu Manoj : ఆ సాంగ్ షూటింగ్ రోజే వాళ్ళ నాన్న చనిపోయారు.. మూడో రోజే వచ్చి డ్యాన్స్.. ఆ హీరోపై మనోజ్ కామెంట్స్..

ఇవాళ మీడియాతో మనోజ్ మాట్లాడగా మీకు ఇన్నేళ్ల గ్యాప్ ఎందుకు వచ్చింది అని అడగ్గా మొదట.. నాకు మా(మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్)లో మెంబర్షిప్ ఇవ్వలేదు అని సరదాగా చెప్పాడు. ప్రస్తుతం మా ప్రసిడెంట్ మంచు విష్ణు కాబట్టి కౌంటర్ గా అలా చెప్పాడు.

అనంతరం మనోజ్ ఇన్నాళ్లు సినిమాలకు ఎందుకు దూరమయ్యారు అనేదానికి సమాధానమిస్తూ.. సినిమాలకు దూరం ఉంటాను అనుకోని అధికారికంగానే సినిమాలు ఆపేస్తున్నాను అని ప్రకటించాను. కానీ తర్వాత ఆ ట్వీట్ డిలీట్ చేసేసాను. నేను నచ్చకుండా కొన్ని పనులు చేయలేను. నచ్చిన పని నచ్చకుండా చేయలేను. అందుకే బ్రేక్ తీసుకున్నాను. రెండేళ్ల తర్వాత మళ్ళీ వద్దాం అని అహం బ్రహ్మాస్మి సినిమా అనౌన్స్ చేశాను. కానీ అది ఆగిపోయింది. సినీ పరిశ్రమకు నా మీద కోపం వచ్చినట్టు ఉంది. కొన్ని ప్రయత్నాలు చేసిన కుదరలేదు. ఆ తర్వాత నా లైఫ్ లో ఛేంజెస్ వచ్చాయి. మీరు చూసారు, నా గురించి మీకు తెలుసు. నేను సినిమాల్లోకి వద్దామనుకున్నా కుదరలేదు. ఇన్నాళ్లకు కుదిరింది. ఇకపై వరుసగా సినిమాలు చేస్తాను అని తెలిపాడు.

Also Read : Manchu Manoj : మాదాపూర్ ఆఫీస్ లో కూర్చొని నాపై ట్రోల్స్.. నా భార్య సపోర్ట్ చాలు.. ఇండస్ట్రీలో నాకు ఫోన్ చేసారు కానీ..