Manchu Manoj : ఆ సాంగ్ షూటింగ్ రోజే వాళ్ళ నాన్న చనిపోయారు.. మూడో రోజే వచ్చి డ్యాన్స్.. ఆ హీరోపై మనోజ్ కామెంట్స్..

తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మనోజ్ మీడియాతో మాట్లాడాడు.

Manchu Manoj Interesting Comments on Nara Rohith

Manchu Manoj : : మనోజ్ మే 30న భైరవం సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ కూడా హీరోలుగా నటిస్తున్నారు. భారీ మల్టీస్టారర్ గా ఈ సినిమా రాబోతుంది. ఇప్పటికే రిలీజయిన సాంగ్స్, ట్రైలర్, టీజర్స్ తో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మనోజ్ మీడియాతో మాట్లాడాడు.

ఈ క్రమంలో నారా రోహిత్ గురించి మాట్లాడుతూ.. భైరవం సినిమాలో డమ్ డమ్ సాంగ్ షూటింగ్ మొదలయిన రోజే నారా రోహిత్ ఫాదర్ చనిపోయారు. దాంతో షూటింగ్ ఆ రోజు ఆపేసారు. రోహిత్ వెళ్లి కార్యక్రమాలు పూర్తి చేసాడు. సాంగ్ కోసం సెట్ వేశారు, ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు, నిర్మాత డబ్బులు వృధా కాకూడదు అని వాళ్ళ నాన్న చనిపోయిన మూడో రోజే వచ్చి ఆ సాంగ్ షూట్ కి వచ్చాడు. ఆ బాధలో కూడా డ్యాన్స్ చేసాడు. ఆ విషయంలో నిజంగా రోహిత్ గ్రేట్ అని తెలిపాడు.

Also Read : Manchu Manoj : మాదాపూర్ ఆఫీస్ లో కూర్చొని నాపై ట్రోల్స్.. నా భార్య సపోర్ట్ చాలు.. ఇండస్ట్రీలో నాకు ఫోన్ చేసారు కానీ..

అలాగే.. రోహిత్ నాకు ఎప్పట్నుంచో మంచి ఫ్రెండ్. ఈ సినిమాతో మేమిద్దరం ఇంకా కోజ్ అయ్యాము. సెట్ లో మేమిద్దరం వంట కూడా చేసాము. రోహిత్ మంచి చెఫ్ అని చెప్పుకొచ్చాడు మనోజ్. నిన్న భైరవం ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో మనోజ్ ఎమోషనల్ అవ్వడంతో నేడు రోహిత్.. మనోజ్ కి ఏం జరిగినా నేను తోడు ఉంటాను అంటూ ట్వీట్ చేసాడు.

 

Also Read : HariHara VeeraMallu : పవన్ హరిహర వీరమల్లు నుంచి మూడో సాంగ్ రిలీజ్ డేట్, టైం అనౌన్స్.. ఎప్పుడో తెలుసా?