Manchu Manoj Nani Ustaad Show first episode Promo released
Ustaad Show : మంచు మనోజ్ హోస్ట్ గా చేస్తూ ‘ఉస్తాద్’ అనే సెలబ్రిటీ షోని ఆడియన్స్ ముందుకు తీసుకు వస్తున్నారు. ప్రముఖ తెలుగు ఓటీటీ ‘ఈ విన్’లో ఈ షో ప్రసారం కాబోతుంది. ఇటీవలే ఈ షో కాన్సెప్ట్ ని వివరిస్తూ మనోజ్ తో ఒక ప్రోమోని రిలీజ్ చేశారు. తాజాగా నేడు ఈ షో మొదటి ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోని రిలీజ్ చేశారు. మొదటి ఎపిసోడ్ కి నేచురల్ స్టార్ నాని గెస్ట్ గా వచ్చారు. ఇక ఈ షోలో నానితో పాటు మరో అతిథి కూడా పాల్గొనబోతున్నారు. అతిథి అంటే సెలబ్రిటీ అనుకున్నారేమో.. అసలు కాదు.
ఈ షోలో నానితో పాటు తన వీరాభిమాని కూడా అతిథిగా పాల్గొనబోతున్నారు. నాని పక్కన కూర్చొని, నానితో ఆట ఆడి.. ఇంటికి ప్రైజ్ మనీ గెలుచుకొని తీసుకు వెళ్లబోతున్నాడు. ఈమె నాకంటే ఫేమస్ అని చెబుతూ.. నాని తన వీరాభిమాని ‘శ్రీప్రియ’ ని అందరికి పరిచయం చేశారు. ఇక ప్రోమోలో నాని అండ్ శ్రీప్రియ కలిసి గేమ్ ఆడుతున్న సన్నివేశాలను కూడా చూపించారు. ప్రోమో చూస్తుంటే.. ఈ కొత్త షో పై ఆడియన్స్ లో క్యూరియాసిటీ క్రియేట్ అయ్యింది. డిసెంబర్ 15న ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది.
Also read : ET20 : రజినీకాంత్ బర్త్ డే అప్డేట్స్.. అమెరికాలో ఫ్యామిలీ స్టార్.. చిరు, త్రిషతో మన్సూర్‌కు ఎదురుదెబ్బ..
Vachestunna Konchem Crazy & Konchem Kotthaga with Biggest Ever Celebrity Game Show#?????? – Ramp-Adidham ?
With our dearest Natural Star @NameisNani ?
Entertainment & FUN like never before Guaranteed ?Get ready to witness the battle for… pic.twitter.com/F3LKRl3ctX
— Manoj Manchu??❤️ (@HeroManoj1) December 12, 2023
ఇక మనోజ్ విషయానికి వస్తే.. 2017లో వచ్చిన ‘ఒక్కడు మిగిలాడు’ సినిమా తరువాత మరో మూవీని అనౌన్స్ చేయలేదు. ఆ తర్వాత ఓ రెండు సినిమాల్లో గెస్ట్ అప్పీరెన్స్ మాత్రమే ఇచ్చారు. మనోజ్ ని తెరపై చూసి దాదాపు 6 ఏళ్ళు అయిపోయింది. ఇన్నాళ్ల తరువాత సినిమాలతో రీ ఎంట్రీ కాకుండా బుల్లితెర షోతో ఎంట్రీ ఇవ్వడం విశేషం. ఇక ఈ షోతో పాటు ప్రస్తుతం మరో రెండు సినిమాల్లో కూడా నటిస్తున్నారు. ‘వాట్ ది ఫిష్’ సినిమా షూటింగ్ ని శరవేగంగా జరుపుతున్నారు. ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్స్ ని కూడా రిలీజ్ చేశారు.