ET20 : రజినీకాంత్ బర్త్ డే అప్డేట్స్.. అమెరికాలో ఫ్యామిలీ స్టార్.. చిరు, త్రిషతో మన్సూర్‌కు ఎదురుదెబ్బ..

టాలీవుడ్ టు బాలీవుడ్ మూవీ అప్డేట్స్ వైపు ఒక లుక్ వేసేయండి.

ET20 : రజినీకాంత్ బర్త్ డే అప్డేట్స్.. అమెరికాలో ఫ్యామిలీ స్టార్.. చిరు, త్రిషతో మన్సూర్‌కు ఎదురుదెబ్బ..

ET 20 Latest Entertainment News Today on 12 December

Updated On : December 12, 2023 / 8:10 PM IST

‘డెవిల్‌’ ట్రైలర్..
నందమూరి కల్యాణ్‌రామ్‌.. బ్రిటిష్‌ సీక్రెట్‌ ఏజెంట్‌గా నటించిన చిత్రం ‘డెవిల్‌’. ఈ సినిమా ట్రైలర్‌ను చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది. సంయుక్త, మాళవిక నాయర్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అభిషేక్‌ నామా స్వీయ నిర్మాణంలో తెరకెక్కించారు. పీరియాడికల్‌ స్పై థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా ఈ నెల 29 ప్రేక్షకుల ముందుకు రానుంది.

రజినీకాంత్ బర్త్ డే అప్డేట్స్..
సూపర్ స్టార్‌ రజనీకాంత్ తన నెక్ట్స్‌ సినిమా టైటిల్ రివీల్ చేశారు. ఇవాళ తన పుట్టినరోజు సందర్భంగా.. 170వ సినిమా టైటిల్ టీజర్‌ను విడుదల చేసింది. ఈ సినిమాకు వెట్టయన్ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. 73వ పుట్టినరోజుకు స్పెషల్ ట్రీట్‌గా, మేకర్స్ టీజర్‌తో పాటు అధికారిక టైటిల్‌ను వెల్లడించారు. అలాగే లాల్ సలామ్ నుంచి ఒక చిన్న యాక్షన్ టీజర్ ని రిలీజ్ చేశారు.

ఓ మై బేబీ అంటూ మహేష్..
మహేశ్‌బాబు, శ్రీలీల జంటగా నటిస్తోన్న చిత్రం గుంటూరు కారం. ఈ సినిమాకు త్రివిక్రమ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది. ఓ మై బేబీ అనే ప్రోమో సాంగ్‌ను ఇదివరకే విడుదల చేయగా.. రేపు పూర్తి సాంగ్‌ను విడుదల చేయనున్నారు.

సలార్ రన్ టైమ్..
ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న మూవీ సలార్‌. ట్రైలర్‌తో సెన్సేషన్‌ క్రియేట్ చేసిన ఈ మూవీ ఈ నెల 22న రిలీజ్‌కానుంది. ఇక సలార్‌ మూవీ 2 గంటల 55 నిమిషాల లాంగ్ రన్ టైమ్ ఫిక్స్ చేసుకుంది. ఇప్పటికే డబ్బింగ్ ఫైనల్ వర్షన్ కూడా కంప్లీట్ చేసుకున్న సలార్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.

ఆపరేషన్‌ వాలంటైన్‌ కొత్త రిలీజ్ డేట్..
వరుణ్ తేజ్, మానుషి చిల్లర్ జంటగా శక్తిప్రతాప్ సింగ్ డైరెక్షన్‌లో వస్తున్న మూవీ ఆపరేషన్‌ వాలంటైన్‌. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీ ఈ నెల 8న రిలీజ్ అవ్వాల్సి ఉంది. కానీ రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకుని ఫిబ్రవరి 16 అని కొత్త డేట్ అనౌన్స్‌ చేసింది మూవీ టీమ్‌.

అమెరికాలో ఫ్యామిలీ స్టార్..
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా పరశురామ్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న మూవీ ఫ్యామిలీ స్టార్. సంక్రాంతి రేస్‌ నుంచి తప్పుకున్న ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ప్రస్తుతం ఫ్యామిలీస్టార్‌ టీమ్‌ అమెరికాలో నాన్‌స్టాప్‌గా షూట్ చేస్తూ బిజీగా ఉంది.

సరదా సరదాగా సైంధవ్‌..
విక్టరీ వెంకటేశ్ నటిస్తున్న తాజా చిత్రం సైంధవ్‌. యాక్షన్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘హిట్‌’ ఫేమ్‌ శైలేష్‌ కొలను దర్శకత్వం వహిస్తున్నాడు. వెంకట్‌ బోయనపల్లి నిర్మాత. వెంకటేష్‌ నటిస్తున్న 75వ చిత్రమిది. ఈ సినిమా నుంచి రెండో సాంగ్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్. సరదా సరదాగా అనే సాంగ్‌ను విడుదల చేసింది.

మన్సూర్‌కు ఎదురుదెబ్బ..
త్రిష, చిరంజీవి, ఖుష్బూ కారణంగా తన పరువుకు భంగం వాటిల్లిందంటూ వారిపై మద్రాస్‌ హైకోర్టులో మన్సూర్‌ ఇటీవల పరువునష్టం దావా వేశారు. ఈ కేసు విచారణలో మన్సూర్‌కు ఎదురుదెబ్బ తగిలింది. మన్సూర్‌ ప్రవర్తనను న్యాయస్థానం తప్పుబట్టింది. నిజానికి ఈ కేసు మన్సూర్‌పై త్రిష నమోదు చేయాలని తెలిపింది.

నాగచైతన్య తండేల్‌..
నాగచైతన్య నటిస్తున్న లేటెస్ట్ చిత్రం తండేల్‌. చందు మెుండేటీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో.. సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది. రోమాంటిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఓ అప్‌డేట్ వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ డిసెంబర్‌ 15 నుంచి ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో సాయిపల్లవి పక్కా పల్లెటూరి అమ్మాయిగా కనిపించనుంది. చైతూ కెరీర్‌లోనే అత్యధికంగా 70 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది.

అడివి శేష్, శ్రుతిహాసన్ లవ్ స్టోరీ..
హీరో అడివి శేష్ మరో క్రేజీ ప్రాజెక్టుతో ముందుకు రాబోతున్నారు. శ్రుతిహాసన్ జంటగా.. ఓ లవ్ స్టోరీ సినిమాలో నటించనున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌ పథాకంపై.. సుప్రియ యార్లగడ్డ ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ చిత్రానికి షేన్ డియో దర్శకత్వం వహించనున్నారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

యానిమల్ కలెక్షన్ల వర్షం..
భారీ అంచనాల మధ్య విడుదలైన యానిమల్ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటి వరకు ఈ సినిమా 738 కోట్లను రాబట్టింది. విడుదలైన 11 రోజుల్లోనే ఇన్ని కోట్లు కలెక్ట్ చేసింది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో.. రణబీర్ కపూర్, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాలో అనిల్ కపూర్, బాబీ డియోల్ ముఖ్య పాత్రలు పోషించారు.

యదార్థ సంఘటనను ఆధారంగా ‘పిండం’..
‘పిండం’ చిత్రంతో ప్రేక్షకుల్ని భయపెట్టేందుకు సిద్ధమవుతున్నారు హీరో శ్రీరామ్‌. ఆయన.. ఖుషీ రవి జంటగా నటించిన ఈ సినిమాని సాయికిరణ్‌ దైదా తెరకెక్కించారు. ఈ సినిమా డిసెంబర్‌ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. నల్గొండ జిల్లాలో జరిగిన ఓ యదార్థ సంఘటనను ఆధారంగా చేసుకొని ఈ చిత్రాన్ని నిర్మించామని మువీ యూనిట్ తెలిపింది.

సోహైల్ బూట్‌కట్‌ బాలరాజు..
స‌య్యద్ సోహైల్, అనన్య నాగళ్ల ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం బూట్‌కట్‌ బాలరాజు. శ్రీ కొన్నేటి దర్శకత్వం వహించగా.. బెక్కెం బ‌బిత స‌మర్పణ‌లో గ్లోబ‌ల్ ఫిలిమ్స్, లక్కీ మీడియా బ్యానర్స్‌పై బెక్కెం వేణుగోపాల్ నిర్మించారు. కుటుంబ బంధాలు, స్నేహబంధాలు, ప్రేమబంధాల నేపథ్యంలో వాణిజ్యవిలువల సమాహారంగా ఈ సినిమా ఉంటుందని దర్శకుడు తెలిపారు. ఇంద్రజ, వెన్నెల కిశోర్, బ్రహ్మాజీ ప్రధాన పాత్రలు పోషించారు.

కన్నడ నుంచి మరో పాన్ ఇండియా మూవీ..
కన్నడ హీరో ప్రజ్వల్‌ దేవరాజ్‌ నటించిన తాజా చిత్రం ‘కరావళి’. స్వీయ నిర్మాణ దర్శకత్వంలో గురుదత్త గనిన ఈ సినిమాను తెరకెక్కించారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్‌లుక్‌ ప్రోమోను విడుదల చేశారు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రానికి సచిన్‌ బస్రూర్‌ సంగీతం అందించారు.

హనుమాన్‌ ట్రైలర్‌..
యంగ్‌ హీరో తేజ సజ్జా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం హనుమాన్‌. ఈ సినిమాకు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి కొత్త అప్‌డేట్ అందించారు మేకర్స్‌. ఈ సినిమా ట్రైలర్‌ను ఈ నెల 19న విడుదల చేస్తామని ప్రకటించారు. ఈ సినిమాలో అమృత అయ్యర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీ జనవరి 12న గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది.

పాయల్ రాజ్‌పుత్‌ పుట్టిన రోజు వేడుకలు..
ఇటీవలే మంగళవారం సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌. తాజాగా తన పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరుపుకుంది ఈ బ్యూటీ. ఆ వేడుకలకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. సినీ ప్రియులు తనపై చూపిస్తోన్న ప్రేమాభిమానాలకు ఆమె ధన్యవాదాలు చెప్పారు.

‘ఆహా’లో ‘రాక్షస కావ్యం’..
అభయ్‌ నవీన్‌, కుశాలిని, అన్వేష్‌ మైఖేల్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రాక్షస కావ్యం’. శ్రీమాన్‌ కీర్తి దర్శకుడు. దామురెడ్డి, శింగనమల కల్యాణ్‌ సంయుక్తంగా నిర్మించారు. మైథాలజీని, నేటి సామాజిక పరిస్థితులను అన్వయించి రూపొందించిన ఈ సినిమాలో , పవన్‌ రమేష్‌, రోహిణి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ‘ఆహా’లో డిసెంబరు 15వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ది ఫ్యామిలీ మ్యాన్‌ 2 అప్డేట్..
ది ఫ్యామిలీ మ్యాన్‌’, ‘ది ఫ్యామిలీ మ్యాన్‌ 2’ వంటి స్పై, థ్రిల్లర్‌ వెబ్‌ సిరీస్‌లతో ప్రేక్షకులను అలరించారు బాలీవుడ్‌ నటుడు మనోజ్‌ బాజ్‌పాయ్‌. రాజ్‌ అండ్‌ డీకే తెరకెక్కించిన ఈ సిరీస్‌ల తదుపరి సీక్వెల్‌ కోసం సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తర్వాతి సిరీస్‌ ఎప్పుడు పట్టాలెక్కనుందనే విషయంపై మనోజ్‌ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరి నెలాఖరు నుంచి ఈ సిరీస్‌ను మెుదలు పెడతామని చెప్పారు.

జమ్ములో ‘డంకీ’..
షారుక్‌ ఖాన్‌ హీరోగా రాజ్‌కుమార్‌ హిరాణీ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘డంకీ’. ఈ సినిమా విడుదలకు ముందు.. షారుక్‌ జమ్ములోని ప్రఖ్యాత వైష్ణోదేవి ఆలయాన్ని సందర్శించారు. పఠాన్, జవాన్‌ రెండు చిత్రాలకు ముందు కూడా.. ప్రఖ్యాత వైష్ణోదేవి ఆలయాన్ని షారుక్‌ సందర్శించారు. ఇప్పుడు ‘డంకీ’ విడుదలకు ముందు కూడా ఆయన ఈ ఆలయానికి వెళ్లారు.

రజనీకాంత్ పుట్టినరోజు వేడుకలు..
ఇవాళ రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా.. ఆయన అభిమానులు, సెలబ్రిటీలు సూపర్‌స్టార్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా ప్రేమ చిత్రాలకు ఫేమస్ డైరెక్టర్‌గా పేరుపొందిన కరుణాకర్‌ తనదైన శైలిలో రజనీకి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన చిత్రాన్ని డ్రాయింగ్ వేసి.. తన అభిమానాన్ని చాటుకున్నారు.