Manchu Manoj : ఆస్తి గొడవలు కాదు.. నాకు న్యాయం జరగాలి.. మా అన్న వెనకుండి నాన్నతో చేయిస్తున్నాడు.. మనోజ్ సంచలన వ్యాఖ్యలు..

కలెక్టర్ తో మీటింగ్ అనంతరం మంచు మనోజ్ మీడియాతో మాట్లాడుతూ..

Manchu Manoj Sensational Comments on Manchu Vishnu after Meeting with Collector

Manchu Manoj : గత కొన్నాళ్లుగా సాగుతున్న మంచు కుటుంబం పంచాయితీ నేడు రంగారెడ్డి కలెక్టరేట్ కి చేరింది. రంగారెడ్డి కలెక్టర్ కు మోహన్ బాబు జల్ పల్లిలోని తన ఇంటిని కొంతమంది ఆక్రమించారు అని ఫిర్యాదు చేసి ఇంట్లో వాళ్ళను ఖాళీ చేయించామని విజ్ఞప్తి చేయడంతో ఆ ఇంట్లో ఉంటున్న మనోజ్ కు కలెక్టర్ నోటీసులు పంపించారు. దీంతో మనోజ్ రంగారెడ్డి కలెక్టర్ ని కలిశారు.

కలెక్టర్ తో మీటింగ్ అనంతరం మంచు మనోజ్ మీడియాతో మాట్లాడుతూ.. న్యాయం పొందేవరకు నా పోరాటం ఆగదు. విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని వ్యతిరేకించినందుకే మా అన్నయ్య మా నాన్నను అడ్డం పెట్టుకొని ఆడుతున్న నాటకం ఇదంతా. మాకు ఆస్తి గొడవలు ఏమి లేవు. విద్యార్థులు, నా కుటుంబం, నా బంధువుల కోసమే నా పోరాటం. నాపై అనేక కేసులు పెడుతున్నారు. చివరికి చంద్రమండలంలో కేసు పెట్టినా నేను భయపడను. జిల్లా అదనపు కలెక్టర్ గారికి అన్ని వివరాలు తెలిపాను. వాళ్ళు అడగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాను అని తెలిపారు.

Also Read : Manchu Manoj Vs Mohan Babu : కలెక్టర్ వద్దకు చేరిన ‘మంచు’ పంచాయితీ.. మోహన్ బాబు vs మంచు మనోజ్

అలాగే జల్ పల్లి ఆస్తి వివాదం గురించి మాట్లాడుతూ.. విషయాల్లో నేను అక్రమంగా ఎంటర్ కాలేదు. కూర్చోని మాట్లాడండి అని చెప్పాను. నేను పారిపోవడం లేదు, ఎప్పుడు పిలిచినా వస్తానని చెప్పాను. ఆస్తి విషయాల్లో నేను ఏం తప్పు చేయలేదు. తిరుపతి యూనివర్సిటీలో జరిగిన తగడాల్లో ప్రశ్నించినందుకు నన్ను టార్గెట్ చేసారు. విష్ణు నా తండ్రిని అడ్డం పెట్టుకొని ఆడుతున్న నాటకం ఇదంతా. టోటల్ ఎపిసోడ్ లో దొంగలు ఎవరో ప్రజలు అందరికీ తెలుసు. ఆ రోజు జల్ పల్లి లో ఉన్న నా ఇంటికి రానివ్వలేదు. నా కూతురి లోపల ఉంది, గొడవ జరిగింది. బయట యూనివర్శిటీ స్టూడెంట్స్ కోసం నేను నిలబడ్డను. నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. నాన్నగారిని నేను ఎప్పుడూ వ్యతిరేకించను. కలెక్టర్ ఆదేశాలనుసారం నడుచుకుంటాను. నాకు న్యాయం జరగాలి అని అన్నారు.

 

Also Read : Chiranjeevi-Thaman : చిరంజీవి ట్వీట్‌కు త‌మ‌న్ రిప్లై.. ఒక్కోసారి ఆవేదన..