Manchu Viranica started a new brand MAISON AVA for children's dresses in London
Viranica Manchu : మంచు విష్ణు భార్యగా విరానిక ఇక్కడ అందరికి తెలుసు. ఎక్కువగా మంచు విష్ణు పోస్ట్ చేసే ఫొటోల్లో తప్ప బయట కనపడదు. అయితే తాజాగా మంచువిష్ణు భార్య వెరోనికా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఏరియాల్లో ఒకటైన లండన్ హోరోడ్స్ లో ఫ్యాషన్ స్టోర్ ప్రారంభించింది. వెరోనికా న్యూయార్క్ లో పుట్టి అక్కడే చదువుకుంది. నగల డిజైన్, జెమాలజీ మరియు ఫ్యాషన్ మార్కెటింగ్‌లో డిగ్రీ చేసింది. విష్ణుని పెళ్లి చేసుకున్నాక ఇండియాకి వచ్చేసింది. పెళ్లి తర్వాత తన ఇంట్లో వాళ్లకి కొత్త డ్రెస్ లు, నగలు తనే డిజైన్ చేసేదట. కొన్ని రోజులుగా ఇండియాలో విరానికా అనే బొటిక్ ని కూడా నడుపుతుంది. ఇన్ని సంవత్సరాలు లండన్ లో ఫ్యాషన్ స్టోర్ పెట్టాలని దాని కోసం వర్క్ చేసింది.
తాజాగా మార్చ్ 9న చిల్డ్రన్స్ కోసం “MAISON AVA” అనే బ్రాండ్ ని ప్రారంభించి దాని స్టోర్ ని ప్రపంచంలోని ప్రముఖ లగ్జరీ డిపార్ట్మెంట్ స్టోర్ అయిన లండన్ లోని హారోడ్స్ లో ఓపెన్ చేసింది వెరోనికా. ఇక్కడ 2-14 సంవత్సరాల అబ్బాయిలు మరియు అమ్మాయిల కోసం అన్ని రకాల ఖరీదైన, సరికొత్త డిజైన్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ చాలావరకు డ్రెస్ లు మిషిన్స్ ని వాడకుండా చేత్తో తయారుచేసినవే అమ్ముతారట. ఫ్యాషన్ డిజైన్ చదివిన చాలామంది ఇపుడు వెరోనికా స్టోర్ “MAISON AVA” కోసం పనిచేస్తున్నారు. దీంతో విరానిక ఈ బ్రాండ్ షోరూమ్ ఓపెన్ చేసినందుకు మంచు అభిమానులు, నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు.
Varun Sandesh : వరుణ్ సందేశ్ ‘చిత్రం చూడరా’.. ఈ సినిమాతో అయినా కమ్‌బ్యాక్ ఇస్తాడా?
దీనిపై విరానిక మాట్లాడుతూ.. లండన్ హారోడ్స్ మా బ్రాండ్ ఓపెన్ చేయాలనే నా కల నిజమైంది. నలుగురి పిల్లలకి తల్లిగా, నేను చాలా సంవత్సరాలు హారోడ్స్ లో కస్టమర్‌గా ఉన్నాను, కాబట్టి షాప్ ఫ్లోర్‌లో మా దుస్తులు చూడటం చాలా ఆనందంగా ఉంది. “MAISON AVA” అనేది నా అభిరుచికి, అత్యుత్తమ భారతీయ హస్తకళతో కలిపి తయారయింది. విశిష్ట అభిరుచి కలిగిన హారోడ్స్ కస్టమర్‌లకు మా దుస్తులను కూడా ప్రదర్శించడం సంతోషిస్తున్నాను. వారికి మా డిజైన్లు నచ్చుతాయని భావిస్తున్నాను అని తెలిపింది.