Allu Arjun : మంచు విష్ణు గారు.. అంటూ అల్లు అర్జున్ ట్వీట్.. బన్నీకి స్పెషల్ లెటర్ రాసిన విష్ణు..

తాజాగా నటుడు, మా(MAA) ప్రసిడెంట్ మంచు విష్ణు(Manchu Vishnu) అల్లు అర్జున్ కి స్పెషల్ లెటర్ రాశారు.

Allu Arjun : మంచు విష్ణు గారు.. అంటూ అల్లు అర్జున్ ట్వీట్.. బన్నీకి స్పెషల్ లెటర్ రాసిన విష్ణు..

Manchu Vishnu Appreciate Allu Arjun for Selected 69 national best actor award Pushpa Movie Allu Arjun Special Tweet

Updated On : September 10, 2023 / 9:37 AM IST

Allu Arjun : ఇటీవల అల్లు అర్జున్ పుష్ప(Pushpa) సినిమాకు గాను 69వ జాతీయ ఉత్తమ నటుడు(National Best Actor) అవార్డు గెలుచుకున్నాడు. దీంతో దేశమంతటా అల్లు అర్జున్ కి అభినందనలు వెలువెత్తాయి. అభిమానులు, ప్రముఖులు అల్లు అర్జున్ కి సోషల్ మీడియాలో విషెస్ తెలిపారు. పలువురు టాలీవుడ్ ప్రముఖులు అల్లు అర్జున్ ని కలిసి మరీ అభినందించారు. తాజాగా నటుడు, మా(MAA) ప్రసిడెంట్ మంచు విష్ణు(Manchu Vishnu) అల్లు అర్జున్ కి స్పెషల్ లెటర్ రాశారు.

మంచు విష్ణు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరపున అల్లు అర్జున్ కి లేఖ రాయగా, ఈ లేఖలో.. డియర్ అల్లు అర్జున్ మీరు ఆరోగ్యంగా, ఆనందంగా ఉన్నారని ఆశిస్తున్నాను. పుష్ప సినిమాలో మీ అద్భుతమైన నటనకు నేషనల్ అవార్డు వచ్చిన్నందుకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరపున అభినందనలు. మీ కృషి, కష్టం వల్లే ఈ గుర్తింపు వచ్చింది. మీకే కాకుండా నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్న మొదటి తెలుగు నటుడిగా తెలుగు పరిశ్రమకు మరింత గుర్తింపు తెచ్చారు. ప్రస్తుతం నేను విదేశాల్లో ఉన్నాను. అందుకే డైరెక్ట్ గా కలవలేకపోతున్నాను, హైదరాబాద్ వచ్చాక మిమ్మల్ని కలవడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. మీరు సాధించిన విజయానికి మరోసారి అభినందనలు. మీరు భవిష్యత్తులో భారతీయ సినిమాని ప్రభావితం చేయాలి అని కోరుకుంటున్నాను అని తెలిపారు మంచు విష్ణు.

Trisha : త్రిష లిప్ కిస్ ఇస్తాను అంటే.. ఆ హీరో వద్దన్నాడట.. ఆ సినిమాలో లిప్ కిస్ లేకపోవడమే మంచిదయింది..

దీంతో ఈ లెటర్ ని అల్లు అర్జున్ ట్విట్టర్ లో పోస్ట్ చేసి.. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, మంచు విష్ణు గారికి ఈ అద్భుతమైన లెటర్ ఇచ్చినందుకు ధన్యవాదాలు మిమ్మల్ని కలవడానికి నేను కూడా ఎదురు చూస్తున్నాను అని తెలిపారు. దీంతో ఏ లెటర్, అల్లు అర్జున్ ట్వీట్ వైరల్ గా మారింది.