Manchu Vishnu : లడ్డు వివాదంపై, జానీ మాస్టర్ ఇష్యూపై మంచు విష్ణు వ్యాఖ్యలు.. పవన్ కళ్యాణ్ గారిని ప్రకాష్ రాజ్ విమర్శిస్తే..

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి సంబంధించిన ఓ ఈవెంట్ కి నేడు మంచు విష్ణు హాజరయ్యారు.

Manchu Vishnu : లడ్డు వివాదంపై, జానీ మాస్టర్ ఇష్యూపై మంచు విష్ణు వ్యాఖ్యలు.. పవన్ కళ్యాణ్ గారిని ప్రకాష్ రాజ్ విమర్శిస్తే..

Manchu Vishnu Comments on Tirumala Laddu Issue and Pawan Kalyan

Updated On : September 29, 2024 / 1:05 PM IST

Manchu Vishnu : ప్రస్తుతం దేశవ్యాప్తంగా లడ్డు వివాదం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. దీనిపై ఒక్కోక్కరు తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. ఇప్పటికే లడ్డు వివాదంపై మంచు విష్ణు సోషల్ మీడియాలో స్పందించారు. తాజాగా మరోసారి మంచు విష్ణు ఈ వివాదంపై మీడియాతో మాట్లాడారు.

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి సంబంధించిన ఓ ఈవెంట్ కి నేడు మంచు విష్ణు హాజరయ్యారు. ఈ ఈవెంట్లో మీడియా లడ్డు వివాదం గురించి ప్రశ్నించగా.. మూవీ ఆర్టిస్ట్ ప్రసిడెంట్ గా అందరి తరపున నేను మాట్లాడాను. అది చాలా సెన్సిటివ్ ఇష్యూ, పవన్ కళ్యాణ్ గారిని ప్రకాష్ రాజ్ గారు విమర్శించినప్పుడు అది తప్పు అని నేను చెప్పాను. పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ గా మాట్లాడినట్టే కదా. నాది తిరుపతి. నాకు ఆ ఎమోషన్ ఉంటుంది. నేను రెగ్యులర్ గా లడ్డు తింటాను. తప్పు చేసిన వారికి శిక్ష పడాలి అని అన్నారు. దీంతో మంచు విష్ణు వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Also Read : Sai Durgha Tej : పిల్లల కోసం సాయి దుర్గ తేజ్ విరాళం.. వరల్డ్ హార్ట్ డే కార్యక్రమంలో ఫ్యామిలీతో పాల్గొని..

అలాగే జానీ మాస్టర్ కేసుపై స్పందిస్తూ.. జానీ మాస్టర్ ఇష్యూ మా దగ్గరకు రాలేదు. మా దగ్గరికి వస్తే మాట్లాడతాను. ప్రస్తుతం ఫిలిం ఛాంబర్ చూసుకుంటుంది. డ్యాన్సర్ అసోసియేషన్ లో ఉంది. అలాగే ఆ కేసు కోర్టులో ఉంది. కోర్టులో ఉన్నప్పుడు ఎవరూ మాట్లాడకూడదు. తప్పు చేస్తే ఎవరినైనా కోర్టు శిక్ష వేస్తుంది. డ్యాన్సర్ అసోసియేషన్ ఇప్పటికే చర్యలు తీసుకుబండి అని అన్నారు.