Movie Artists Association : యూట్యూబ్ ఛానల్స్‌పై’మా’ అసోసియేషన్ కొరడా.. 5 ఛానల్స్ తొలగింపు..

సినీ న‌టులు, వారి కుటుంబ స‌భ్యుల ప‌ట్ల అభ్యంత‌రక‌ర కంటెంట్‌ను పోస్ట్ చేస్తున్న యూట్యూబ్ ఛానల్స్‌ పై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) కొర‌డా ఝ‌ళిపించింది.

Manchu Vishnu deadline completed Five YouTube channels were cancelled

సినీ న‌టులు, వారి కుటుంబ స‌భ్యుల ప‌ట్ల అభ్యంత‌రక‌ర కంటెంట్‌ను పోస్ట్ చేస్తున్న యూట్యూబ్ ఛానల్స్‌ పై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) కొర‌డా ఝ‌ళిపించింది. ఐదు యూట్యూబ్ ఛానల్స్ ని తొల‌గించింది. ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా తెలియ‌జేసింది. ఇది కేవ‌లం ప్రారంభం మాత్ర‌మేనంటూ మిగిలిన యూట్యూబ‌ర్స్‌కు హెచ్చ‌రిక పంపించింది.


మంచు విష్ణు చెప్పిన‌ట్లుగానే..

రెండు రోజుల క్రితం.. కొన్ని యూట్యూబ్ ఛానళ్లల్లో ప్రసారమౌతోన్న అభ్యంత‌ర‌క‌ర‌, అస‌భ్య‌ కంటెంట్‌తో కూడిన కథనాలపై ప్రముఖ నటుడు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు స్పందించారు. 48 గంట‌ల్లోగా అలాంటి వాటిని తొల‌గించాల‌ని హెచ్చ‌రించాడు. మ‌హిళ‌ల‌, సినీ న‌టుల‌పై అస‌భ్య‌క‌ర పోస్టులు పెడితే ఊరుకోబోమ‌న్నాడు.

Also Read: వామ్మో.. ఏఆర్ రహమాన్‌కి అన్ని వందల కోట్ల ఆస్తి..? ఇండియాలోనే అత్యధిక ఆస్తి ఉన్న మ్యూజిక్ డైరెక్టర్..

ఇటీవల ఓ తండ్రి-కుమార్తెపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ వీడియో పోస్ట్‌ చేసిన యూట్యూబర్లపై విష్ణు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు. ఇది తెలుగు వారి స్వ‌భావం కాద‌న్నాడు. త‌న దృష్టికి వ‌చ్చిన కొన్ని యూట్యూబ్‌, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌ల్లోని కథనాలను చూడగా.. అత్యంత జుగుప్సాకరంగా ఉన్నాయ‌న్నారు. వాటి గురించి మాట్లాడాలంటేనే ఒళ్లు జలదిస్తోందని తెలిపాడు.

సెక్యువ‌ల్ కంటెంట్‌తో ఉన్న యూట్యూబ్ ఛాన‌ళ్ల‌ను క‌ట్టడి చేయ‌డానికి త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాలంటూ ప్ర‌తీ రోజు హీరో, హీరోయిన్లు, న‌టీన‌టులు, ఫిల్మ్ ఇండ‌స్ట్రీ నుంచి త‌నను కోరుతున్నార‌న్నాడు. ఇలాంటి కంటెంట్‌ను సోష‌ల్ మీడియాలో తొల‌గించాల‌న్నాడు. ఇందుకు 48 గంట‌ల స‌మ‌యం ఇస్తున్న‌ట్లు చెప్పాడు. అప్ప‌టిలోగా తొల‌గించ‌క‌పోతే సైబ‌ర్ క్రైమ్ విభాగానికి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ త‌రుపున‌ ఫిర్యాదు చేస్తామ‌ని హెచ్చ‌రించారు.

Also Read: రాజ్ తరుణ్ లవర్ లావణ్య హై డ్రామా.. అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకుంటున్నా అంటూ..

మంచు విష్ణు ఇచ్చిన 48 గంట‌ల స‌మ‌యం ముగిసింది. ఈ క్ర‌మంలో ఏం చ‌ర్య‌లు తీసుకుంటారా..? అని ఎదురుచూస్తుండ‌గా.. చెప్పిన‌ట్లుగానే యూట్యూబ్ సాయంతో మొద‌ట‌గా ఓ ఐదు ఛాన‌ళ్ల‌ను తొలగించారు.

ట్రెండింగ్ వార్తలు