AR Rahaman : వామ్మో.. ఏఆర్ రహమాన్‌కి అన్ని వందల కోట్ల ఆస్తి..? ఇండియాలోనే అత్యధిక ఆస్తి ఉన్న మ్యూజిక్ డైరెక్టర్..

తాజాగా ఓ నేషనల్ మీడియా సమాచారం ప్రకారం భారతదేశంలోనే అత్యధిక ఆస్తి ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ గా ఏఆర్ రహమాన్ నిలిచాడు.

AR Rahaman : వామ్మో.. ఏఆర్ రహమాన్‌కి అన్ని వందల కోట్ల ఆస్తి..? ఇండియాలోనే అత్యధిక ఆస్తి ఉన్న మ్యూజిక్ డైరెక్టర్..

Shocking Facts on Music Director AR Rahaman Property and Remuneration

AR Rahaman : ఏఆర్ రహమాన్ పేరు వినగానే మొదట అతను ఇచ్చిన బోల్డన్ని మంచి పాటలే గుర్తొస్తాయి. 1990వ దశకంలో తమిళ్, తెలుగులో ఎన్నో సినిమాలకు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చి తన పాటలతో ఆ సినిమాలని సూపర్ హిట్ కూడా చేసాడు. బాంబే, రోజా, జెంటిల్ మెన్, రంగీలా, ప్రేమికుడు, జీన్స్, దిల్ సే.. ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో తన పాటలతో ప్రేక్షకులని మైమరిపించాడు.

ఇప్పటికి ఏఆర్ రహమాన్ పాత పాటలు అందరూ వింటూనే ఉంటారు. ఆస్కార్, గ్రామీ అవార్డులతో పాటు ఎన్నో నేషనల్ అవార్డులు, ప్రైవేట్ అవార్డులు, పద్మ భూషణ్ బిరుదు కూడా అందుకున్నాడు ఏఆర్ రహమాన్. అయితే తాజాగా ఓ నేషనల్ మీడియా సమాచారం ప్రకారం భారతదేశంలోనే అత్యధిక ఆస్తి ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ గా ఏఆర్ రహమాన్ నిలిచాడు. ఏఆర్ రహమాన్ దగ్గర స్థిరాస్తి, చరాస్థి.. అన్ని కలుపుకొని దాదాపు 1728 కోట్ల విలువ చేసే ఆస్తులు ఉన్నాయని ఓ నేషనల్ మీడియా వెల్లడించింది.

Also Read : Bharateeyudu 2 : ఆ పాట కోసం భారతీయుడు 2 సినిమాకు వెళ్తే.. అసలు ఆ పాటే లేదుగా..

దీంతో ఈ విషయం తెలిసి అంతా ఆశ్చర్యపోతున్నారు. ఒక మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర ఇన్ని వందల కోట్ల ఆస్తులు ఉన్నాయా అని అవాక్కవుతున్నారు. ఏఆర్ రహమాన్ ఒకప్పుడు ఫుల్ ఫామ్ లో ఉన్నాడు అప్పుడే బాగా సంపాదించాడు. సినిమాల్లోని సాంగ్స్ మాత్రమే కాక విడిగా బయట షోలు చేసి కూడా ఏఆర్ రహమాన్ బాగా సంపాదించాడు. ప్రస్తుతం ఏఆర్ రహమాన్ ఒక్కో పాటకు మూడు కోట్లు తీసుకుంటున్నాడని టాక్ కూడా నడుస్తుంది.

దేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రహమాన్ అని తెలుస్తుంది. తాజా లెక్కల ప్రకారం ఏఆర్ రహమాన్ ఆస్తి విలువ, రెమ్యునరేషన్ చూసి అందరూ షాక్ అవుతున్నారు. అయితే ఒకప్పుడు ఎన్నో సూపర్ హిట్స్ ఇచ్చిన ఏఆర్ రహమాన్ ఇప్పుడు మాత్రం అడపాదడపా సినిమాలు చేస్తున్నా ఒకప్పటిలా మ్యాజిక్ అయితే కనిపించట్లేదని అతని అభిమానులు, మ్యూజిక్ లవర్స్ అంటున్నారు.