Kannappa : కన్నప్ప అదిరిందప్ప.. ఫస్ట్ డే కలెక్షన్స్.. మంచు విష్ణు అదరగొట్టడుగా..!

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెర‌కెక్కిన చిత్రం క‌న్న‌ప్ప‌.

Kannappa : కన్నప్ప అదిరిందప్ప.. ఫస్ట్ డే కలెక్షన్స్.. మంచు విష్ణు అదరగొట్టడుగా..!

Manchu Vishnu Kannappa Box Office Day 1 collections

Updated On : June 28, 2025 / 1:03 PM IST

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెర‌కెక్కిన చిత్రం క‌న్న‌ప్ప‌. ముఖేష్ కుమార్ సింగ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో ప్రీతీ ముకుంద‌న్ క‌థానాయిక‌. భారీ అంచ‌నాల మ‌ధ్య శుక్ర‌వారం (జూన్ 27) ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది ఈ చిత్రం. పాజిటివ్ రెస్పాన్స్‌ను ద‌క్కించుకుంది.

ఇక ఈ చిత్రం తొలి రోజు ప్ర‌పంచ వ్యాప్తంగా రూ.20 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌ను సాధించిన‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. మంచు విష్ణు కెరీర్‌లోనే అత్య‌ధిక ఓపెనింగ్స్ ఇదేన‌ని అంటున్నారు. ఈ రోజు శ‌నివారం, రేపు ఆదివారం కావ‌డంతో ఈ చిత్ర వ‌సూళ్లు మ‌రింత‌గా పెరిగే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.

Shefali Jariwala : కాంటా లగా ఫేమ్ ఫషాలీ జ‌రివాలా మ‌ర‌ణం.. వంట మ‌నిషిని ప్ర‌శ్నిస్తున్న పోలీసులు..

ఈ చిత్రంలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, మోహన్ బాబు, బ్రహ్మనందం తదితరులు కీలకపాత్రలు పోషించారు. అవా ఎంటర్‌టైన్‌మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌‌లపై మోహన్ బాబు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించారు.

చిత్రానికి దాదాపు రూ.120 కోట్ల నిర్మాణ వ్యయం అయినట్లు ట్రేడ్ పండితులు తెలిపారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ భాషలలో ఈ చిత్రాన్ని విడుద‌ల చేశారు.