Manchu Vishnu Mosagallu To Be Also Available On AHA
Manchu Vishnu: టాలీవుడ్ యంగ్ హీరో మంచు విష్ణు నటించిన పాన్ ఇండియా మూవీ ‘మోసగాళ్లు’ రిలీజ్‌కు ముందర ఎలాంటి హైప్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను కేవలం తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లోనూ రిలీజ్ చేయడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూశారు. ఇక ఈ సినిమా రిలీజ్ తరువాత బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్‌ను అందుకుంది.
Manchu Vishnu : కాజల్ అప్పుడు సింగిల్.. ఇప్పుడు మింగిల్.. పిల్లలు పుట్టాక రిలీజయ్యేదేమో సినిమా..
అయితే ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇప్పటికే అందుబాటులో ఉంది. కాగా, తాజాగా ఈ సినిమాను మరో ఓటీటీ ప్లాట్‌ఫాం ‘ఆహా’లో ఈనెల 16 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి అఫీషియల్ పోస్టర్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వరల్డ్ బిగ్గెస్ట్ ఐటీ స్కామ్ అనే క్యాప్షన్‌తో ఈ సినిమా రావడంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిని చూపారు.
ఇక ఈ సినిమాలో అందాల భామ కాజల్ అగర్వాల్, బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి, నవ్‌దీప్, నవీన్ చంద్ర ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. అమెరికన్ డైరెక్టర జెఫ్రీ జి చిన్ ఈ సినిమాను డైరెక్ట్ చేయగా, విష్ణు ఈ సినిమాను స్వయంగా ప్రొడ్యూస్ చేశాడు. మరి ఆహాలో స్ట్రీమింగ్ కాబోతున్న ఈ సినిమాకు ప్రేక్షకులు ఎలాంటి రెస్పాన్స్‌ను ఇస్తారో చూడాలి.
It’s all fun and games, until $300million scam happens?. A gripping cyber crime thriller #Mosagallu premieres September 16.#MosagalluOnAHA@iVishnuManchu @MsKajalAggarwal @SunielVShetty @ruhisingh11 @Naveenc212 @pnavdeep26 @TheLeapMan pic.twitter.com/ZqM0idjSAu
— ahavideoin (@ahavideoIN) September 14, 2022