Manchu Vishnu : కాజల్ అప్పుడు సింగిల్.. ఇప్పుడు మింగిల్.. పిల్లలు పుట్టాక రిలీజయ్యేదేమో సినిమా..

కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత ఓ సినిమా ఫంక్షన్‌లో పాల్గొంది. చాలా రోజుల తర్వాత కాజల్ కనిపించడంతో ఫ్యాన్స్ గోలగోల చేశారు. ఇక ఇదే వేదిక మీద నవదీప్, మంచు విష్ణు కాజల్ మీద సెటైర్లు వేసి నవ్వించారు. రానా.. ‘‘మేమిద్దరం కలిసి సినిమా చేశాం.. నిజ జీవితంలో కూడా పెళ్లిళ్లైపోయాయ్ మాకు’’.. అంటూ కాజల్‌కు కంగ్రాట్స్ చెప్పాడు.

Manchu Vishnu : కాజల్ అప్పుడు సింగిల్.. ఇప్పుడు మింగిల్.. పిల్లలు పుట్టాక రిలీజయ్యేదేమో సినిమా..

Manchu

Manchu Vishnu: కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత ఓ సినిమా ఫంక్షన్‌లో పాల్గొంది. చాలా రోజుల తర్వాత కాజల్ కనిపించడంతో ఫ్యాన్స్ గోలగోల చేశారు. ఇక ఇదే వేదిక మీద నవదీప్, మంచు విష్ణు కాజల్ మీద సెటైర్లు వేసి నవ్వించారు. రానా.. ‘‘మేమిద్దరం కలిసి సినిమా చేశాం.. నిజ జీవితంలో కూడా పెళ్లిళ్లైపోయాయ్ మాకు’’.. అంటూ కాజల్‌కు కంగ్రాట్స్ చెప్పాడు.

Mosagallu

నవదీప్.. ‘‘మోసగాళ్లు’ సినిమాలో కాజల్ నాకు అక్క కాదు, విష్ణుకి అక్క.. ‘ఆర్య 3’ ప్లాన్ చేద్దాం.. అందులో హీరో మిస్టర్ కిచ్లు (కాజల్ భర్త) అవుతారు’.. అన్నాడు.
మంచు విష్ణు మాట్లాడుతూ.. ‘‘సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు కాజల్ సింగిల్ గా ఉంది.. ఇప్పుడు మింగిల్ అయింది.. పాండమిక్ అయిపోయి ఇప్పుడు థియేటర్లు ఓపెన్ అయ్యాయి.. లేకపోతే పిల్లలు పుట్టాక రిలీజ్ అయ్యేదేమో సినిమా’’.. అంటూ నవ్వించాడు.

Mosagallu

మంచు విష్ణు, కాజల్‌ అగర్వాల్‌ అక్కాతమ్ముళ్లుగా నటించిన పాన్ ఇండియా సినిమా ‘మోసగాళ్లు’.. జెఫ్రీ గీ చిన్‌ డైరెక్ట్ చేశారు. AVA Entertainment, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్‌పై విష్ణు నిర్మించారు. బాలీవుడ్ నటుడు సునీల్‌ శెట్టి విలన్‌గా, రుహీ సింగ్‌ కథానాయికగా నటించగా.. నవదీప్, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో పోషించారు.. మార్చి 19న ‘మోసగాళ్లు’ భారీ ఎత్తున రిలీజవుతోంది.

Mosagallu