Manchu Vishnu : మంచు విష్ణు బెస్ట్ ఫ్రెండ్ ఎవ‌రో తెలుసా..? స్పెష‌ల్ పోస్ట్‌తో ఫోటోను షేర్ చేసి..

మంచు విష్ణు డ్రీం ప్రాజెక్టు కన్నప్ప సినిమాని మొదలుపెట్టి శరవేగంగా షూటింగ్ చేస్తున్నారు.

Manchu Vishnu shares a post about tikki who is his best friend

Manchu Vishnu – Kannappa : మంచు విష్ణు డ్రీం ప్రాజెక్టు కన్నప్ప సినిమాని మొదలుపెట్టి శరవేగంగా షూటింగ్ చేస్తున్నారు. ముకేశ్ కుమార్ సింగ్ ద‌ర్శ‌క‌త్వంలో భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మోహ‌న్ బాబు నిర్మిస్తున్నారు. యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌, కలెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు, మ‌ల‌యాళ స్టార్ న‌టుడు మోహ‌న్ లాల్‌, లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార‌, శివ‌రాజ్‌కుమార్, అక్షయ్ కుమార్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన ఈ చిత్ర టీజ‌ర్ సినిమాపై అంచ‌నాల‌ను పెంచేసింది.

ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుద‌ల అవుతుందా అని అంద‌రూ ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. రిలీజ్ సంగ‌తి కాస్త ప‌క్క‌న పెడితే తాజాగా మంచు విష్ణు త‌న ఫాలోవ‌ర్స్‌కు త‌న స్పెష‌ల్ ఫ్రెండ్‌ను ప‌రిచ‌యం చేశాడు.

Jani Master : మతం మార్చుకొని పెళ్లి చేసుకోవాలంటూ జానీ మాస్టర్ బలవంతం.. సంచలన విషయాలు వెల్లడించిన యువతి..

‘టిక్కిని క‌ల‌వండి. క‌న్న‌ప్ప‌లో త‌నే నా సోద‌రుడు, నా బెస్ట్ ఫ్రెండ్‌. మునుపెన్నడూ చేయ‌ని విధంగా.. నాతో విన్యాసాలు చేయించింది. ఇది అద్భుత‌మైన గుర్రం.’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో మంచు విష్ణు తెలిపాడు. తాను గుర్రంపై ఉన్న ఫోటోను అభిమానుల‌తో పంచుకున్నాడు. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

Telugu Indian Idol Season 3 : ఫైనల్స్ కి వచ్చేసిన తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3.. విన్నర్ ఎవరో..?