Manchu Vishnu : ఇలా కూడా సేవ్ చేసుకుంటారా? అసలు పేర్లే లేకుండా.. ఇది మంచు విష్ణు స్టైల్..
తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మంచు విష్ణు మాట్లాడుతూ..

Manchu Vishnu Tells about his Phone Contact Saving Style
Manchu Vishnu : మంచు విష్ణు జూన్ 27న కన్నప్ప సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వరుసగా పలు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఈ క్రమంలో అనేక ఆసక్తికర విషయాలు తెలియచేస్తున్నారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మంచు విష్ణు తన ఫోన్ లో పేర్లతో కాంటాక్ట్స్ సేవ్ చేసుకోను అని డిఫరెంట్ గా, నిక్ నేమ్స్ తో సేవ్ చేసుకుంటాను అని తెలిపాడు.
మంచు విష్ణు మాట్లాడుతూ.. నేను ఫోన్ లో ఎవరి పేర్లు నేమ్స్ తో సేవ్ చేసుకోను. నాన్న(మోహన్ బాబు) గారి పేరు మంచు లయన్ కింగ్ అని సేవ్ చేసుకున్నా. విని(మంచు విష్ణు భార్య) పేరు మామాచీకా అని సేవ్ చేసుకున్నా అంటే స్పానిష్ లో హాట్ ఉమెన్ అని అర్ధం. మా అమ్మ పేరు మంచు క్లారిటీ అని సేవ్ చేసుకున్నా. మా అమ్మకు ఉన్నంత క్లారిటీ మంచు ఫ్యామిలిలో ఎవరికీ లేదు. ఇక ప్రభాస్ పేరు రెబల్ అని సేవ్ చేసుకున్నా అని తెలిపాడు. అలాగే మరో ఇద్దరు తన కజిన్స్ పేర్ల గురించి కూడా చెప్పాడు.
Also Read : Sobhita Dhulipala : నైట్ వేర్ లో నాగచైతన్య భార్య, హీరోయిన్ ‘శోభిత ధూళిపాళ’.. ఫొటోలు వైరల్..
మంచు విష్ణు ఇలా తన ఫోన్ లో అందరి పేర్లను వెరైటీగా నేమ్స్ తోనో, నిక్ నేమ్స్ తోనే సేవ్ చేసుకుంటాను అని చెప్పడంతో ఇది మంచు విష్ణు స్టైల్ అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఏదో ఒకరిద్దరి పేర్లైతే నిక్ నేమ్స్ తో అందరూ సేవ్ చేసుకుంటారు కానీ అందరి పేర్లు అలాగే చేసుకుంటారా అని మంచు విష్ణు చెప్పిన మాటలని విని ఆశ్చర్యపోతున్నారు.
I’ve saved Prabhas contact number under this name in my phone, revealed @iVishnuManchu#Prabhas #Kannappapic.twitter.com/iPJG5SAR3q
— Telugu Chitraalu (@TeluguChitraalu) June 4, 2025
Also Read : Dulquer Salman : దుల్కర్ సల్మాన్, సంయుక్త మలయాళం సినిమా.. ఇప్పుడు తెలుగులో..