Maniratnam : హిందీ వాళ్ళు బాలీవుడ్ అని చెప్పడం మానేయాలి..

తాజాగా దర్శకుడు మణిరత్నం సౌత్ సినిమా, బాలీవుడ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం మణిరత్నం పొన్నియిన్ సెల్వన్ 2 సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు.

Maniratnam sensational comments on Bollywood goes viral

Maniratnam :  గత కొన్నాళ్లుగా బాలీవుడ్, సౌత్ అని ఎక్కువగా వినపడుతోంది. ఇటీవల సౌత్ సినిమాలువరుసగా భారీ విజయాలు సాధిస్తుండటంతో ఈ భేదం బాగా వినిపిస్తుంది. ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ అనే చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల నుంచి కూడా భారీ సినిమాలు వచ్చి ప్రపంచవ్యాప్తంగా హిట్ అవుతున్నాయి.

తాజాగా దర్శకుడు మణిరత్నం సౌత్ సినిమా, బాలీవుడ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం మణిరత్నం పొన్నియిన్ సెల్వన్ 2 సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఏప్రిల్ 28న పాన్ ఇండియా విడుదల కానుంది. దీంతో చిత్రయూనిట్ గత కొన్ని రోజులుగా పొన్నియిన్ సెల్వన్ 2 సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. తాజాగా ఈ ప్రమోషన్స్ లో భాగంగా చెన్నైలో జరుగుతున్న CII దక్షిణ సమ్మిట్ కార్యక్రమంలో కూడా మణిరత్నం పాల్గొన్నారు.

Ramabanam Trailer Launch Event : రామబాణం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్యాలరీ..

ఈ కార్యక్రమంలో మణిరత్నం మాట్లాడుతూ.. హిందీ సినిమా వాళ్ళు తాము బాలీవుడ్ అని చెప్పుకోవడం మానేయాలి. అలా అయితేనే ప్రజలు, ప్రపంచం భారతీయ సినిమను బాలీవుడ్ గా గుర్తించడం మానేస్తారు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్.. ఇవ్వని నాకు వ్యక్తిగతంగా నచ్చవు. వీటన్నిటిని మనం ఇండియన్ సినిమాగానే చూడాలి. బాలీవుడ్ ఒక్కటే కాదు ఇవన్నీ కూడా ఇండియన్ సినిమాలే అని అన్నారు. దీంతో మణిరత్నం చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్ లో వైరల్ గా మారాయి.