Manoj Bajpayee : సెన్సార్ వస్తే ఓటీటీ చచ్చిపోతుంది.. మనోజ్ బాజ్‌పాయ్‌ వ్యాఖ్యలు..

ఓటీటీలలో ప్రస్తుతం బోల్డ్ సిరీస్ లు ఎక్కువైపోయాయి. కొంతమంది కథకు అవసరం లేకపోయినా కావాలని వ్యూయర్ షిప్ కోసం ఇలాంటివి పెడుతుండటంతో పలువురు ఓటీటీకి కూడా సెన్సార్ తీసుకురావాలని అభిప్రాయపడుతున్నారు.

Manoj Bajpayee sensational comments on Censor to OTT

Manoj Bajpayee : కోవిడ్ సమయంలో సినిమా థియేటర్స్(Theaters) లేకపోవడంతో ఓటీటీకి(OTT) బాగా కలిసి వచ్చింది. ఆ తర్వాత ఓటీటీ పరిశ్రమ ప్రపంచమంతా మరింత పుంజుకుంది. కొత్త కొత్త సినిమాలు, సిరీస్ లు ఎప్పటికప్పుడు అనేక ఓటీటీలలో ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఓటీటీకి సెన్సార్(Censor) లేకపోవడంతో దర్శకులు కథల్ని ఎలాంటి హద్దులు లేకుండా చూపిస్తున్నారు. అయితే కొంతమంది కావాలని బోల్డ్ కంటెంట్, అడల్ట్ కంటెంట్, బూతులు, శృంగార సన్నివేశాలు ఎక్కువగా జొప్పించి మరీ సిరీస్ లు చేస్తున్నారు.

ఓటీటీలలో ప్రస్తుతం ఇలాంటి బోల్డ్ సిరీస్ లు ఎక్కువైపోయాయి. కొంతమంది కథకు అవసరం లేకపోయినా కావాలని వ్యూయర్ షిప్ కోసం ఇలాంటివి పెడుతుండటంతో పలువురు ఓటీటీకి కూడా సెన్సార్ తీసుకురావాలని అభిప్రాయపడుతున్నారు. పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, ప్రజా కార్యకర్తలు ఓటీటీకి కూడా సెన్సార్ ఉండాలని ఇటీవల వ్యాఖ్యానించారు. ప్రభుత్వం కూడా ఈ దిశగా ఆలోచిస్తుందని సమాచారం. అయితే దీనిపై తాజాగా బాలీవుడ్ స్టార్ నటుడు మనోజ్ బాజ్‌పాయ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.

బాలీవుడ్ లో స్టార్ యాక్టర్ గా ఉన్న మనోజ్ బాజ్‌పాయ్‌ ఫ్యామిలీ మెన్ సిరీస్ తో ఒక్కసారిగా దేశమంతా మరోసారి పాపులర్ అయి సెకండ్ ఇన్నింగ్స్ లాగా గ్రాండ్ గా దూసుకెళ్తున్నారు. ఆ సిరీస్ హిట్ అవ్వడంతో మనోజ్ బాజ్‌పాయ్‌ కి మరిన్ని సిరీస్ లు, సినిమాలు వస్తున్నాయి. ప్రస్తుతం మనోజ్ చాలా బిజీగా ఉన్నాడు. తాజాగా తాను చేసిన ఓ సినిమా ఓటీటీలోకి వస్తుండటంతో నిర్వహించిన ప్రమోషన్స్ లో ఓటీటీకి సెన్సార్ గురించి పలువురు ప్రశ్నించగా దీనిపై స్పందించాడు మనోజ్ బాజ్‌పాయ్‌.

Prabhas – Raviteja : సంక్రాంతి బరిలో రెండు యాక్షన్ థ్రిల్లర్స్.. ప్రభాస్ అండ్ రవితేజల్లో ఎవరు గెలుస్తారు..?

మనోజ్ బాజ్‌పాయ్‌ మాట్లాడుతూ.. సెన్సార్ వస్తే కచ్చితంగా ఓటీటీ వ్యవస్థ చచ్చిపోతుంది. ఓటీటీ అనేది ఓ డెమొక్రటిక్ మీడియం. ఎవరు ఏం చూడాలి అని మనం నిర్ణయించలేం. ఓటీటీలు వచ్చిన కొత్తల్లో దర్శకులు తాము చూపించాలి అనుకున్నది ఉన్నది ఉన్నట్టు చూపించారు. కానీ ఇప్పుడు అందరూ స్వీయ నియంత్రణ పాటిస్తున్నారు. అందరు డైరెక్టర్స్ స్వీయ నియంత్రణలో ఉండి కంటెంట్ చూపిస్తే ఓటీటీకి సెన్సార్ అవసరం లేదు. అలా కాకుండా కొన్ని కంటెంట్స్ తగ్గించాలని సెన్సార్ చేస్తే కచ్చితంగా ఓటీటీ వ్యవస్థ చచ్చిపోతుంది. అలాగే తల్లితందృలు కూడా పిల్లలు ఏం చూడాలి అనేది వాళ్ళు చూసుకోవాలి అని అన్నారు. అయితే మనోజ్ బాజ్‌పాయ్‌ చేసిన వ్యాఖ్యలపై పలువురు విమర్శలు చేస్తుండగా కొంతమంది మాత్రం సపోర్ట్ చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు