Manoj Bajpayee : ఫ్లైట్ లో ఫ్రీగా మందు ఇస్తారని తెలిసి పడిపోయేంతవరకు తాగాను..

తాజాగా మనోజ్ బాజ్‌పేయ్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ ఆరంభంలో జరిగిన ఓ సంఘటనను షేర్ చేసుకున్నాడు. మనోజ్ ముంబైకి రాకుముందు ఢిల్లీలో థియేటర్ ఆర్టిస్ట్ గా నాటకాలు వేశాడు. ఆ సమయంలో మొదటిసారి ఫ్లైట్ లో వెళ్లినప్పటి ఓ సంఘటన గురించి చెప్పాడు మనోజ్ బాజ్‌పేయ్.

Manoj Bajpayee : ఫ్లైట్ లో ఫ్రీగా మందు ఇస్తారని తెలిసి పడిపోయేంతవరకు తాగాను..

Manoj Bajpayee shares an interesting incident that happened during his early career

Updated On : April 18, 2023 / 7:42 AM IST

Manoj Bajpayee : బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పేయ్ బండిట్ క్వీన్ సినిమాలో ఓ చిన్న రోల్ తో సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆర్జీవీ సత్య సినిమాతో ఒక్కసారిగా స్టార్ అయ్యాడు మనోజ్ బాజ్‌పేయ్. అప్పట్నుంచి హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. గత కొంతకాలంగా సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు కూడా వరుసగా చేస్తున్నాడు. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తో మరోసారి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు మనోజ్ బాజ్‌పేయ్.

తాజాగా మనోజ్ బాజ్‌పేయ్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ ఆరంభంలో జరిగిన ఓ సంఘటనను షేర్ చేసుకున్నాడు. మనోజ్ ముంబైకి రాకుముందు ఢిల్లీలో థియేటర్ ఆర్టిస్ట్ గా నాటకాలు వేశాడు. ఆ సమయంలో మొదటిసారి ఫ్లైట్ లో వెళ్లినప్పటి ఓ సంఘటన గురించి చెప్పాడు మనోజ్ బాజ్‌పేయ్.

Tim Cook : యాపిల్ CEOకి వడాపావ్ తినిపించిన బాలీవుడ్ హీరోయిన్..

మనోజ్ బాజ్‌పేయ్ మాట్లాడుతూ.. ఢిల్లీలో థియేటర్ చేసేటప్పుడు ఒకసారి పారిస్ లో నాటకం వేసే అవకాశం రావడంతో మొదటి సారి ఫ్లైట్ ఎక్కాను. వెళ్ళేటప్పుడు ఫ్లైట్ లో ఆల్కాహాల్ తాగుతారా అని ఎయిర్ హోస్టెస్ అడిగితే డబ్బులు తీసుకుంటారేమో అని వద్దన్నాను. అప్పటికి అసలు నా దగ్గర సరిగ్గా తినడానికే డబ్బులు ఉండేవి కావు. మాకు నాటకం వేయడానికి అవకాశం ఇచ్చిన వాళ్ళే మమ్మల్ని ఫ్లైట్ లో తీసుకెళ్లారు. అయితే ఫ్లైట్ లో ఆల్కహాల్ కి డబ్బులు తీసుకోరని తర్వాత తెలియడంతో మళ్ళీ పారిస్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు ఫ్లైట్ లో ఫ్రీగా వస్తుందని ఫుల్ గా ఆల్కహాల్ తాగాను. ఎంత తాగానంటే తాగి పడిపోయాను అని తెలిపారు.