Ravindra Mahajani : అద్దె ఇంట్లో శవమై కనిపించిన నటుడు.. సీఎం సంతాపం.. మూడు రోజుల క్రితమే మృతి.. దుర్వాసన రావడంతో..
ప్రముఖ మరాఠీ నటుడు, దర్శకుడు రవీంద్ర మహాజని(Ravindra Mahajani) చనిపోయారు. ఆయన వయస్సు 77 ఏళ్లు. పూణే సమీపంలోని తలేగావ్ దభాడేలోని అంబి ప్రాంతంలోని అద్దె ప్లాట్‌లో ఆయన మృతదేహాం కనిపించింది.

Ravindra Mahajani
Marathi actor Ravindra Mahajani : ప్రముఖ మరాఠీ నటుడు, దర్శకుడు రవీంద్ర మహాజని(Ravindra Mahajani) చనిపోయారు. ఆయన వయస్సు 77 ఏళ్లు. పూణే సమీపంలోని తలేగావ్ దభాడేలోని అంబి ప్రాంతంలోని అద్దె ప్లాట్‌లో ఆయన మృతదేహాం కనిపించింది. ఆయన మరణించి రెండు, మూడు రోజులు అయి ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. రవీంద్ర మహాజని ఇక లేరు అనే విషయం మరాఠీ చిత్ర పరిశ్రమను షాక్‌కు గురి చేసింది.
మహాజని గత కొంత కాలంగా అద్దె ప్లాట్‌లో ఒంటరిగా ఉంటున్నారు. శుక్రవారం సాయంత్రం సమయంలో అతడి చుట్టు పక్కల వాళ్లు పోలీసులు కాల్ చేశారు. అతడి ఇంటి నుంచి భరించలేని దుర్వాసన వస్తుందనే విషయాన్ని చెప్పారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు తలుపులు పగుల కొట్టి లోపలికి వెళ్లారు. అక్కడ కనిపించిన దృశ్యం చూసి షాకైయ్యారు.
Kushi : షూటింగ్ పూర్తి.. పుల్ స్వింగ్‌లో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు.. సెలబ్రేషన్స్ చూశారా
చనిపోయి రెండు మూడు రోజుల కావడంతో మృతదేహాం కుళ్లిపోతుందని తలేగావ్ దభాడే పోలీస్ స్టేషన్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. వెంటనే అతడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చినట్లు చెప్పారు. ముంబైలో సొంత ఇంటిని కలిగి ఉన్న మహాజనీ గత ఎనిమిది నెలలుగా తలేగావ్ దభాడేలో నివాసం ఉంటున్నారన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
తన కెరీర్‌లో ఎన్నో చిత్రాల్లో నటించడంతో పాటు పలు చిత్రాలకు దర్శకుడిగానూ పని చేసి పరిశ్రమలో చెరగని ముద్ర వేశారు. ముంబైచా ఫౌజ్దార్, అరమ్ హరామ్ ఆహే, జూంజ్, బోలో హే చక్రధారి వంటి చిత్రాలు ఆయనకు మంచి పేరును తెచ్చిపెట్టాయి. అతడి కుమారుడు గష్మీర్ మహాజని కూడా నటుడే. మరాఠీ సినిమాల్లో అతడికి మంచి పేరు ఉంది.
మహాజనీ మృతికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే సంతాపం తెలిపారు. “తన ఆకట్టుకునే నటనా నైపుణ్యంతో ప్రేక్షకుల హృదయాలను శాసించిన ప్రముఖ మరాఠీ నటుడు రవీంద్ర మహాజని కన్నుమూశారు. భగవంతుడు ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని, మహాజని కుటుంబానికి ఈ దుఃఖం నుంచి కోలుకునే శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. హృదయపూర్వక నివాళి. “అంటూ ట్వీట్ చేశారు.
आपल्या सर्वांगसुंदर अभिनयाने रसिक प्रेक्षकांच्या मनावर अधिराज्य गाजवणारे ज्येष्ठ मराठी अभिनेते रवींद्र महाजनी यांचे दुर्दैवी निधन झाले आहे. परमेश्वर त्यांच्या आत्म्यास चिरशांती प्रदान करो तसेच महाजनी परिवारास या दुःखातून सावरण्यासाठी बळ देवो हीच प्रार्थना. भावपूर्ण श्रद्धांजली. pic.twitter.com/blubQ0geUC
— Eknath Shinde – एकनाथ शिंदे (@mieknathshinde) July 15, 2023
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) అధ్యక్షుడు శరద్ పవార్ కూడా నటుడికి నివాళులర్పించారు. ఆయన అకాల మరణం మరాఠీ చిత్ర పరిశ్రమకు తీరని లోటు అని అన్నారు .