Maruva Tarama : ఆకట్టుకుంటున్న మరువ తరమా ఫస్ట్ సాంగ్.. యూత్ మనసు దోచేస్తున్న మ్యూజికల్ మెలోడీ!

ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న 'మరువ తరమా' సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయ్యింది. పాదం పరుగులు తీసే.. అంటూ సాగే లిరిక్స్ యూత్ ని అట్ట్రాక్ట్ చేస్తున్నాయి.

Maruva Tarama : ఆకట్టుకుంటున్న మరువ తరమా ఫస్ట్ సాంగ్.. యూత్ మనసు దోచేస్తున్న మ్యూజికల్ మెలోడీ!

Maruva Tarama first song Padham Parugulu is released

Updated On : May 8, 2023 / 3:54 PM IST

Maruva Tarama : డిఫరెంట్ కంటెంట్ తో ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘మరువ తరమా’ మూవీ. అద్వైత్ ధనుంజయ హీరోగా అతుల్యా చంద్ర, అవంతిక నల్వా హీరోయిన్లుగా రూపొందుతున్న ఈ సినిమాను సిల్వర్ స్క్రీన్ పిక్చర్స్ బ్యానర్ పై గిడుతూరి రమణ మూర్తి, రుద్రరాజు విజయ్ కుమార్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చైతన్య వర్మ నడింపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ మూవీ నుంచి తాజాగా పాదం పరుగులు తీసే.. సాంగ్ రిలీజ్ చేశారు.

Maruva Tarama first song Padham Parugulu is released

Maruva Tarama first song Padham Parugulu is released

ఈ పాటలో గాఢమైన ప్రేమలో ఉన్న యువకుడి ఫీలింగ్స్ తెలిసేలా చైతన్య వర్మ రాసిన లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి. పాదం పరుగులు తీసే.. అంటూ సింగర్ PVNS రోహిత్ ఆలపించిన తీరు సాంగ్‌కి మేజర్ అసెట్ అని చెప్పుకోవచ్చు. పాటకు తగ్గట్టుగా మెలోడియస్ ట్యూన్ తో విజయ్ బుల్గనిన్ ఆకట్టుకున్నారు. ఫ్రెష్ ఫీల్ తెప్పిస్తున్న మ్యూజిక్ ఈ సాంగ్‌కి ప్రాణం పోసింది. ఇక పాటలో చూపించిన అందమైన లొకేషన్స్ హైలైట్ అయ్యాయి. సాధారణంగా లవర్స్ నడుమ జరిగే రొమాంటిక్ మూమెంట్స్ చాలా నాచురల్ గా చూపించారు. హైదరాబాద్ చారిత్రక కట్టడం చార్మినార్ వద్ద హీరో హీరోయిన్ లిప్ కిస్ సీన్ పాటలో స్పెషల్ అట్రాక్షన్ అయింది. మొత్తంగా చూస్తే ఈ సాంగ్ యువత మనసు దోచేయడమే గాక సినిమాపై హైప్ తీసుకొచ్చిందని చెప్పుకోవచ్చు.

Pushpa 2: పుష్ప-2లో మెగా డాటర్.. అలాంటి రోల్‌లో నటిస్తుందా..?

ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన అన్ని అప్ డేట్స్ ప్రేక్షకుల మెప్పు పొందాయి. ఇప్పుడు వదిలిన ఫస్ట్ సాంగ్ సినిమాపై ఆసక్తి పెంచేసింది. యూత్ కోరుకునే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉండబోతున్నాయని స్పష్టం చేస్తోంది ఈ సాంగ్. విడుదల చేసిన వెంటనే యూట్యూబ్ భారీ రేంజ్ రెస్పాన్స్ అందుకుంది ఈ పాట. త్వరలోనే ఈ మూవీ విడుదల తేదీని, మిగతా వివరాలను ప్రకటించనున్నారు మేకర్స్.

ఈ చిత్రానికి విజయ్ బుల్గనిన్ సంగీతాన్ని అందించగా.. రుద్ర సాయి కెమెరామెన్‌గా, కె.ఎస్.ఆర్ ఎడిటర్‌గా వ్యవహరించారు. అద్వైత్ ధనుంజయ , అతుల్యా చంద్ర, అవంతిక నల్వా ముఖ్య పాత్రల్లో నటించారు.