Eagle Collections : అదరగొట్టిన రవితేజ.. మూడు రోజుల్లో ఈగల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో ధమాకాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మాస్ మహారాజ ఇప్పుడు ఈగల్ తో మరో హిట్ కొట్టాడు.

Eagle Collections : అదరగొట్టిన రవితేజ.. మూడు రోజుల్లో ఈగల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Mass Maharaja Raviteja Eagle Movie Three Days Collections Full Details Here

Updated On : February 12, 2024 / 12:48 PM IST

Eagle Collections : పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో మాస్ మహారాజ్ రవితేజ(Raviteja) హీరోగా తెరకెక్కిన యాక్షన్ ‘ఈగల్’ సినిమా ఫిబ్రవరి 9న థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజయింది. ఈగల్ లో కావ్య థాపర్(Kavya Thapar) హీరోయిన్ గా నటించగా, అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran), నవదీప్, వినయ్ రాయ్, అవసరాల శ్రీనివాస్, మధుబాల.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు.

ఇక ఈగల్ సినిమా మాస్ యాక్షన్ సీన్స్ తో అదరగొట్టింది. రవితేజ అభిమానులతో పాటు, ప్రేక్షకులని కూడా మెప్పించింది. రవితేజ కొత్త లుక్ లో యాక్షన్ సీక్వెన్స్ లో అదరగొట్టేశాడు. మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈగల్ సినిమా మంచి విజయం సాధించింది. మొదటి రోజు ఈగల్ సినిమా 12 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేయగా మూడు రోజుల్లో ఏకంగా 30 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది.

Also Read : Hanuman : ‘హనుమాన్’ సరికొత్త రికార్డ్.. ఏకంగా 300 సెంటర్స్‌లో.. చాలా ఏళ్ళ తర్వాత సినీ పరిశ్రమలో ఇలా..

త్వరలోనే ఈగల్ సినిమా ఈజీగా 50 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేస్తుందని భావిస్తున్నారు. ఇక ఈగల్ సినిమా 20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందని సమాచారం. ఇప్పటికే 15 కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్ రాగా ఇంకొక్క రోజులో ఈగల్ సినిమా బ్రేక్ ఈవెన్ అయిపోతుందని అంచనా వేస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో ధమాకాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మాస్ మహారాజ ఇప్పుడు ఈగల్ తో మరో హిట్ కొట్టాడు. త్వరలోనే వీళ్ళ కాంబోలో మిస్టర్ బచ్చన్ సినిమా రాబోతుంది. తాజాగా నిన్న ఈగల్ సక్సెస్ మీట్ కూడా నిర్వహించారు చిత్రయూనిట్.