Mass Maharaja Raviteja wants to stop Action Movies and Back to Comedy Films
Raviteja : మాస్ మహారాజ రవితేజ.. కష్టపడి, ఎలాంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలో ప్రతి పని, ప్రతి పాత్ర చేసుకుంటూ వచ్చి స్టార్ హీరో అయినా సంగతి తెలిసిందే. ఎంతోమందికి రవితేజ ఇన్‌స్పిరేషన్. కెరీర్ లో వరుస హిట్స్, వరుస ఫ్లాప్స్ చూసాడు. అయినా ఎప్పుడూ ఆగకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడు రవితేజ. మరోపక్క నిర్మాతగా కూడా సినిమాలు చేస్తున్నాడు.
అయితే ఇటీవల రవితేజ వరుసగా యాక్షన్ సినిమాలు చేస్తున్నాడు. కానీ వాటిల్లో సక్సెస్ రేట్ చాలా తక్కువగా వస్తుంది. 2021లో క్రాక్ సినిమా తప్ప ఆ తర్వాత వచ్చిన యాక్షన్ సినిమాలేవీ అంతగా వర్కౌట్ అవ్వలేదు. క్రాక్ తర్వాత ఇప్పటికి రవితేజ ఆరు సినిమాలతో వచ్చాడు. అందులో ధమాకా ఫుల్ లెంగ్త్ యాక్షన్ కాదు, కామెడీ, శ్రీలీల డ్యాన్సులు బాగా వర్కౌట్ అయి హిట్ అయిందని చెప్పొచ్చు. మిగిలిన ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ, రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్.. ఇవన్నీ యాక్షన్ సినిమాలే. ఇవేవి భారీ హిట్స్ కొట్టలేదు. ఈగల్ ఒక్కటి యావరేజ్ గా నిలిచింది. త్వరలో హరీష్ శంకర్ దర్శకత్వంలో రాబోయే మిస్టర్ బచ్చన్ సినిమా కుడా యాక్షన్ సినిమానే.
Also Read : Tillu Square : టిల్లు గాడి కోసం టోనీ.. ఎన్టీఆర్ గెస్ట్‌గా టిల్లు స్క్వేర్ సక్సెస్ మీట్..
వరుస యాక్షన్ సినిమాలు రవితేజకి కలిసి రావట్లేదని మళ్ళీ తన ఫేవరేట్ జానర్, తనకి బాగా కలిసొచ్చిన జానర్ కామెడీకి షిఫ్ట్ అవుతున్నాడట రవితేజ. రవితేజ కెరీర్ లో యాక్షన్ తో పాటు కామెడీ ఎక్కువ ఉన్న సినిమాలే బాగా హిట్ అయ్యాయి. దీంతో మళ్ళీ కామెడీ మీద ఫోకస్ చేస్తున్నాడట. ఆల్రెడీ జాతి రత్నాలు డైరెక్టర్ అనుదీప్ తో ఓ కామెడీ సినిమాని ప్లాన్ చేసాడు. తాజాగా మరో కామెడీ కథని ఓకే చేసాడు. సామజవరగమన రచయిత భాను బోగవరపు రవితేజకి ఓ కామెడీ కథ చెప్పగా అది బాగా నచ్చిందట. అతడిని దర్శకుడిగా పరిచయం చేస్తూ రవితేజ ఆ సినిమా చేస్తాడని సమాచారం. మరి యాక్షన్ వర్కౌట్ అవ్వకపోయినా తన జానర్ కామెడీ అయినా వర్కౌట్ అయి రవన్న మళ్ళీ ఫుల్ ఫామ్ లోకి రావాలని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.