×
Ad

Nilakanta : ‘నీలకంఠ’ ట్రైలర్ రిలీజ్.. రీ ఎంట్రీ ఇస్తున్న స్నేహ ఉల్లాల్..

తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించి ట్రైలర్ రిలీజ్ చేసారు.(Nilakanta)

Nilakanta

Nilakanta : ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ మాస్టర్ మహేంద్రన్ హీరోగా యష్నా చౌదరి, నేహా పఠాన్ హీరోయిన్ గా స్నేహ ఉల్లాల్ కీలక పాత్రలో తెరకెక్కుతున్న సినిమా నీలకంఠ. ఎల్ఎస్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాకేష్ మాధవన్ దర్శకత్వంలో విలేజ్ యాక్షన్ స్టోరీతో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 2న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించి ట్రైలర్ రిలీజ్ చేసారు.(Nilakanta)

నీలకంఠ ట్రైలర్ చూసేయండి..

Also Read : Thalapathy Vijay: సినిమాలకు ఇక సెలవు.. అభిమానుల సమక్షంలో రిటైర్‌మెంట్‌ ప్రకటించిన విజయ్‌..

ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో నిర్మాత మర్లపల్లి శ్రీనివాసులు మాట్లాడుతూ.. నేను ఐటీ బ్యాక్ గ్రౌండ్ నుంచి సినిమా అంటే ప్యాషన్ తో నిర్మాణంలోకి వచ్చాను. రాకేష్ మాధవన్ బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ చేశాడు. ఆ స్క్రిప్ట్ చదివిన తర్వాత ఈ కథ తప్పకుండా సినిమా అచేయాలని నీలకంఠ ప్రారంభించాం. షూటింగ్ టైమ్ లో ప్రకృతి సహకరించక, కొన్నిసార్లు తుఫాన్ లు ఎదుర్కొని షూటింగ్ లు ఆపేసి, అవాంతరాలు దాటుకుని ఈ సినిమాని తీసుకొస్తున్నాం అన్నారు.

డైరెక్టర్ రాకేష్ మాధవన్ మాట్లాడుతూ.. చాలా షార్ట్ ఫిలింస్ చేసిన తర్వాత ఫీచర్ ఫిలిం చేయాలనే కోరిక నిజమవుతోంది. ఇది దర్శకుడిగా నా మొదటి సినిమా. ట్రైలర్ చూసిన వాళ్లు కొత్త దర్శకుడు చేసినట్లు లేదు అంటున్నారు. చాలా హ్యాపీగా ఉంది. సినిమా చివరి 20 నిమిషాలు చూపు తిప్పుకోకుండా ఉంటుంది. మనం చేసిన మంచి చిత్రాన్ని కూడా ఇతర భాషలకు చూపించాలనే పాన్ ఇండియా రిలీజ్ చేస్తున్నాం అన్నారు.

Also Read : ‘ఈ సినిమాలో ఇంకో హీరో మా నానమ్మ’.. రాజాసాబ్ లో ప్రభాస్ చెప్పిన ఆ హీరో ఈమే..

హీరో మాస్టర్ మహేంద్రన్ మాట్లాడుతూ.. నేను తెలుగువాడినే. తెలుగుతో పాటు తమిళ సినిమాల్లో నటించాను. తెలుగు ఆడియెన్స్ సినిమాను ఎంత ప్రేమిస్తారో తెలుసు. అందుకే తెలుగు ఫిలింమేకర్స్ ఎవరైనా స్క్రిప్ట్ పంపిస్తే చదివేస్తుంటా. నాకు కంటెంట్ ఉన్న మూవీస్ చేయడం ఇష్టం. చేయని తప్పుకు ఊరు ఊరంతా తన మీద నింద మోపితే హీరో ఎలా ఎదుర్కొన్నాడు, తప్పు చేయలేదని ఎలా ప్రూవ్ చేసుకున్నాడు అనే కథాంశంతో ఆసక్తికరంగా ఉంటుంది ఈ సినిమా అని తెలిపాడు.