Vasudheva Sutham : ‘వసుదేవ సుతం’ నుంచి మెలోడీ సాంగ్ విన్నారా..?
ఆస్కార్ అవార్డు గ్రహీత లిరిసిస్ట్ చంద్రబోస్ చేతుల మీదుగా ఈ పాటను రిలీజ్ చేశారు. (Vasudheva Sutham)
Vasudheva Sutham : ‘దేవి’ సినిమా ఫేమ్ చైల్డ్ ఆర్టిస్ట్ మాస్టర్ మహేంద్రన్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘వసుదేవ సుతం’. బేబీ చైత్ర శ్రీ, మాస్టర్ యువాంశ్ కృష్ణ బాదర్ల సమర్పణలో రెయిన్‌బో సినిమాస్ బ్యానర్‌పై ధనలక్ష్మి బాదర్ల నిర్మాణంలో వైకుంఠ్ బోను దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.(Vasudheva Sutham)
ఇప్పటికే వసుదేవ సుతం సినిమా నుంచి సాంగ్, గ్లింప్స్, టీజర్ రిలీజ్ చేయగా తాజాగా ఈ సినిమాలోని మెలోడీ సాంగ్ ని రిలీజ్ చేశారు. ఆస్కార్ అవార్డు గ్రహీత లిరిసిస్ట్ చంద్రబోస్ చేతుల మీదుగా ఈ పాటను రిలీజ్ చేశారు.
‘ఏమైపోతుందో..’ అంటూ సాగే ఈ పాటని మణిశర్మ సంగీత దర్శకత్వంలో శ్రీ హర్ష ఈమని రాయగా పవన్ – శృతిక పాడారు. మీరు కూడా ఈ మెలోడీ పాట వినేయండి..
పాట రిలీజ్ అనంతరం చంద్రబోస్ మాట్లాడుతూ.. ఏమైపోతుందో.. అనే ఈ పాట చాలా బాగుంది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ గారు మంచి ట్యూన్ ఇచ్చారు. సాహిత్యం కూడా చాలా బాగుంది అని అన్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్ త్వరలో ప్రకటించనున్నారు.

Also Read : Prabhas Movie : బాబోయ్.. ఇంకెన్ని సెకండ్ పార్టులు.. ఇంకో సినిమాకు ప్రభాస్ మళ్ళీ రెండో పార్ట్ అంట..
