Raj Tarun : మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న రాజ్ తరుణ్.. యూట్యూబ్ ఫేమ్ అమృత హీరోయిన్ గా కొత్త సినిమా..
తాజాగా మరో కొత్త సినిమా ఓపెనింగ్ చేసాడు రాజ్ తరుణ్.(Raj Tarun)
Raj Tarun
Raj Tarun : ఒకప్పుడు వరుసగా ఆసినిమాలు చేసిన రాజ్ తరుణ్ మధ్యలో కాస్త గ్యాప్ తీసుకున్నాడు. అలాగే ఓ వివాదంలో కూడా నిలవడంతో సినిమాలకు కొంచెం గ్యాప్ ఇచ్చాడు. కాన యిటీవల మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో వస్తున్నాడు. ఇటీవల ఆహా ఓటీటీలో చిరంజీవ సినిమాతో వచ్చాడు. నవంబర్ 21న పాంచ్ మినార్ సినిమాతో రాబోతున్నాడు. తాజాగా మరో కొత్త సినిమా ఓపెనింగ్ చేసాడు.(Raj Tarun)
రాజ్ తరుణ్, యూట్యూబ్ ఫేమ్ అమృత చౌదరి జంటగా నేడు కొత్త సినిమాని ప్రారంభించారు. శ్రీనివాస్ అవసరాల, ధన్య బాలకృష్ణ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రశ్విత ఎంటర్టైన్మెంట్, ఎస్ కె గోల్డెన్ ఆర్ట్స్, చందమామ క్రియేషన్స్, ఎన్వి ఎల్ క్రియేషన్స్ బ్యానర్స్ పై శశిధర్ నల్ల, విజయ్ కుమార్, సంతోష్ ఇమ్మడి, రామిశెట్టి రాంబాబు నిర్మాణంలో రిత్విక్ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.
Also Read : Premante Trailer : ‘ప్రేమంటే’ ట్రైలర్ వచ్చేసింది.. కానిస్టేబుల్ గా యాంకర్ సుమ..
ఈ సినిమాకు ‘టార్టాయిస్’. అనే టైటిల్ పెట్టారు. నేడు ఈ సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహించి టైటిల్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. ఈ సందర్భంగా రాజ్ తరుణ్ మాట్లాడుతూ.. టార్టాయిస్ సినిమా చాలా కొత్తగా ఉంటుంది. డైరెక్టర్ రిత్విక్ కుమార్ కథ చెప్పిన విధానం బాగుంది. ఈ సినిమా నా కెరీర్ కి మంచి కిక్ ఇస్తుంది అని అన్నారు.

డైరెక్టర్ రిత్విక్ కుమార్ మాట్లాడుతూ.. ఈ సినిమా రాజ్ తరుణ్ కెరీర్ లో బెస్ట్ సినిమా అవుతుంది. కొత్త స్క్రీన్ ప్లేతో డిఫరెంట్ కథతో థ్రిల్లర్ సినిమా ఇది. త్వరలో షూటింగ్ మొదలుకానుంది అని తెలిపారు. నిర్మాతలు శశిధర్ నల్ల, విజయ్ కుమార్, సంతోష్ ఇమ్మడి మరియు రామిశెట్టి రాంబాబు గార్లు మాట్లాడుతూ.. టార్టాయిస్ సినిమా కథ చాలా బాగా నచ్చింది మాకు. డైరెక్టర్ రిత్విక్ కుమార్ పై మాకు నమ్మకం ఉంది. రాజ్ తరుణ్ గారితో సినిమా చేయడం సంతోషంగా ఉంది అని తెలిపారు.
Also Read : Prabhas Movie : బాబోయ్.. ఇంకెన్ని సెకండ్ పార్టులు.. ఇంకో సినిమాకు ప్రభాస్ మళ్ళీ రెండో పార్ట్ అంట..
