మీకు మాత్రమే చెప్తా – ‘ల ల లా’ లిరికల్ సాంగ్
విజయ్ దేవరకొండ నిర్మాతగా, డైరెక్టర్ తరుణ్ భాస్కర్‌ను హీరోగా పరిచయం చేస్తూ నిర్మిస్తున్నమూవీ.. 'మీకు మాత్రమే చెప్తా' : 'ల ల లా' అంటూ ఫన్నీగా సాగే ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్..

విజయ్ దేవరకొండ నిర్మాతగా, డైరెక్టర్ తరుణ్ భాస్కర్‌ను హీరోగా పరిచయం చేస్తూ నిర్మిస్తున్నమూవీ.. ‘మీకు మాత్రమే చెప్తా’ : ‘ల ల లా’ అంటూ ఫన్నీగా సాగే ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్..
సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ నిర్మాతగా, డైరెక్టర్ తరుణ్ భాస్కర్‌ను హీరోగా పరిచయం చేస్తూ, ‘మీకు మాత్రమే చెప్తా’ అనే సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.. అభినవ్, అనసూయ ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్నారు. ఈ సినిమా ద్వారా షమ్మీర్ సుల్తాన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.
ఇటీవల ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసిన టీమ్.. రీసెంట్‌గా మీకు ‘మాత్రమే చెప్తా’ నుండి ఫస్ట్ లిరికల్ సాంగ్ విడుదల చేసింది. శివ కుమార్ ట్యూన్‌కి, రాకేందు మౌళి లిరిక్స్ రాయగా, హేమచంద్ర, కృష్ణన్ గణేషన్ కలిసి పాడారు. ‘ఏ ఎందుకు ఎందుకిలా నాకెందుకిలా’ అంటూ హీరో తన దురదృష్టాన్ని ప్రశ్నించుకుంటూ.. తన ఖర్మకు తనను తానే తిట్టుకునే నేపథ్యంలో ఈ పాట సాగుతుంది.
పావని గంగిరెడ్డి, నవీన్ జార్జ్ థామస్, వాణి భోజన్, అవంతిక మిశ్రా, వినయ్ వర్మ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు మ్యూజిక్ : శివకుమార్, సినిమాటోగ్రఫీ : మదన్ గుణదేవా, ఆర్ట్ : రాజ్‌కుమార్, లైన్ ప్రొడ్యూసర్ : విజయ్ మట్టపల్లి, నిర్మాతలు : విజయ్ దేవరకొండ, వర్ధన్ దేవరకొండ..