Meenakshi Chaudhary clarifies news about her marriage to hero Sushant
Meenakshi Chaudhary: స్టార్ బ్యూటీ మీనాక్షి చౌదరి ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఈ అమ్మడు హీరోయిన్ గా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఏ రేంజ్ లో విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అంతేకాదు, వరుసగా హిట్స్ సాధిస్తూ టాలీవుడ్ లక్కీ లేడీగా మారిపోయింది. అందుకే చాలా మంది కుర్ర హీరోలు ఈ అమ్మడితో సినిమాలు చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ఇక మీనాక్షి నుంచి త్వరలో రానున్న సినిమా అనగనగా ఒక రాజు. టాలీవుడ్ టాలెంటెడ్ హీరో నవీన్ పోలిశెట్టి హీరోగా వస్తున్న ఈ సినిమాను మారి తెరకెక్కిస్తున్నాడు. 2026 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా.
Karmastalam: బిగ్ బాస్ దివి పాన్ ఇండియా మూవీ.. ‘కర్మస్థలం’ ఫస్ట్ లుక్ నెక్స్ట్ లెవల్
ఈ నేపధ్యంలోనే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary) తన రిలేషన్స్ షిప్ పై, పెళ్లిపై వస్తున్న వార్తల గురించి స్పందించింది. ఆమె హీరోయిన్ గా తెలుగులో నటించిన మొదటి సినిమా ఇచట వాహనములు నిలుపరాదు. అక్కినేని హీరో సుశాంత్ హీరోగా వచ్చిన ఈ సినిమా ప్లాప్ అయ్యింది. అయితే, ఈ సినిమా సమయంలో సుశాంత్, మీనాక్షి మధ్య ప్రేమ చిగురించింది అని, కొంతకాలంగా వీరు రిలేషన్ లో ఉంటున్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి.
తాజాగా ఇదే విషయాన్ని ఆమె దగ్గర ప్రస్తావించగా క్లారిటీ ఇచ్చింది మీనాక్షి. సోషల్ మీడియాలో వచ్చే రూమర్స్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. వాళ్ళు ఫేమ్ అవడం కోసం, వ్యూస్ కోసం చాలా రాస్తూ ఉంటారు. వాటిలో చాలా వరకు అసత్యాలు ఉంటాయి. ఇవన్నీ కామన్ అయిపోయింది. అలాగే, ఇప్పుడు నా రిలేషన్ గురించి వస్తున్న న్యూస్ లో కూడా ఎలాంటి నిజం లేదు. ఏదైనా ఉంటే స్వయంగా నేనే ప్రకటిస్తాను అంటూ చెప్పుకొచ్చింది మీనాక్షి చౌదరి. దీంతో సుశాంత్-మీనాక్షి రిలేషన్ పై వస్తున్న రూమర్స్ కి చెక్ పడింది.