Meenakshi Chaudhary : మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీనే.. నా బుక్స్ తమ్ముడు చదువుకునేవాడు.. ‘లక్కీ భాస్కర్’ సినిమా గురించి మీనాక్షి చౌదరి..

మీనాక్షి నేడు మీడియాతో మాట్లాడుతూ తన గురించి, తన ఫ్యామిలీ గురించి, లక్కీ భాస్కర్ సినిమా గురించి పలు విషయాలు తెలిపింది.

Meenakshi Chaudhary Interesting Comments on her Family and Lucky Baskhar Family

Meenakshi Chaudhary : వరుస సినిమాలతో దూసుకుపోతున్న మీనాక్షి చౌదరి ఇప్పుడు దుల్కర్ సల్మాన్ కు జంటగా లక్కీ భాస్కర్ సినిమాతో రాబోతుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్‌ బ్యానర్స్ పై వెంకీ అట్లూరి దర్శకత్వంలో లక్కీ భాస్కర్ సినిమా తెరకెక్కింది. దీపావళి కానుకగా అక్టోబర్ 31న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీనాక్షి నేడు మీడియాతో మాట్లాడుతూ తన గురించి, తన ఫ్యామిలీ గురించి, లక్కీ భాస్కర్ సినిమా గురించి పలు విషయాలు తెలిపింది.

లక్కీ భాస్కర్ సినిమా డబ్బు చుట్టూ తిరుగుతుండటంతో మీనాక్షి చౌదరి తన ఫ్యామిలీ, మిడిల్ క్లాస్ గురించి మాట్లాడుతూ.. నాన్న ఆర్మీలో పనిచేసేవారు. అమ్మ హౌస్ వైఫ్. మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. డబ్బు దగ్గర మేము కూడా జాగ్రత్తగా ఉండేవాళ్ళం. చిన్నప్పుడు నా బుక్స్ తమ్ముడు వాడుకునేవాడు. బట్టలు కొంచెం లూజ్ గా కుట్టించుకునే వాళ్ళం వచ్చే సంవత్సరం కూడా సరిపోవాలని. అన్ని మిడిల్ క్లాస్ ఫ్యామిలిల్లో జరిగేవే మాకు జరిగాయి. కానీ డబ్బు లేకపోయినా నన్ను చదివించారు. ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. అందుకే డాక్టర్ చదివాను. ఇప్పుడు నటిగా బిజీగా ఉన్నాను. ఇదే నా సంపాదన. దీంతోనే నా ఇల్లు గడుస్తుంది. నా ఇల్లు పోషించుకుంటున్నాను అంటూ తెలిపింది.

Also Read : Pawan Kalyan – Vijay : రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టినందుకు.. తమిళ్ స్టార్ విజయ్‌ పై పవన్ కళ్యాణ్ ట్వీట్..

లక్కీ భాస్కర్ సినిమా, సితార ఎంటర్టైన్మెంట్స్ గురించి మాట్లాడుతూ.. గుంటూరు కారం తర్వాత సితార ఎంటెర్టైన్మెంట్స్ లో నా రెండో సినిమా ఇది. సినిమా అంతా యంగ్ టీమ్ తో పనిచేసాను. ప్రీ ప్రొడక్షన్ బాగా చేసి సినిమా మొదలుపెట్టాము. డబ్బు కారణంగా ఒక మధ్యతరగతి మనిషి జీవితంలో, అతని ఫ్యామిలిలో ఎలాంటి మార్పులు వచ్చాయనే దాని చుట్టూ కథ తిరుగుతుంది. ఇందులో నేను మొదటిసారి తల్లి పాత్ర పోషించాను. నాకు కొంచెం ఛాలెంజింగ్ గానే అనిపించింది. చిన్నప్పుడు మా అమ్మ ఎలా ఉండేదో తెలుసుకొని ఆ పాత్ర చేశాను. వయసుకు తగ్గ పాత్రలే చేయాలని పరిమితి పెట్టుకోలేదు అని తెలిపింది.

ఈ సినిమాలో తన సుమతి పాత్ర గురించి మాట్లాడుతూ.. భాస్కర్ దగ్గర ఏమీ లేనప్పుడు అతన్ని ఇష్టపడుతుంది. బ్రతకడానికి అవసరమైనంత డబ్బు ఉంటే చాలు అనుకుంటుంది. డబ్బు వచ్చినప్పుడు మొదట హ్యాపీగానే ఉంటుంది. కానీ భాస్కర్ దురాశ, డబ్బు కారణంగా భాస్కర్-సుమతి మధ్య ఏం జరిగింది అనేది ఆసక్తికరంగా, ఎమోషనల్ గా ఉంటుంది అని తెలిపింది. అలాగే బ్యాంకింగ్ నేపథ్యంలో పలు సిరీస్ లు వచ్చాయి కానీ కుటుంబ ఎమోషన్స్ ని లింక్ చేస్తూ ఈ కథ రాసిన విధానం నాకు బాగా నచ్చింది అని తెలిపింది.

దుల్కర్ సల్మాన్ గురించి మాట్లాడుతూ.. తెలుగు ఆయన లాంగ్వేజ్ కాకపోయినా డైలాగ్స్ నేర్చుకొని చెప్పారు. మమ్మూట్టి గారి కొడుకు అయినప్పటికీ విభిన్న పాత్రలు చేస్తున్నారు అని చెప్పింది. ఇక మీనాక్షి మట్కా, మెకానిక్ రాకీ, వెంకటేష్, అనిల్ రావిపూడి సినిమా, తమిళ్ లో రెండు సినిమాలతో బిజీగా ఉంది.